BigTV English

Aghori Srinivas: అఘోరీ మెడికల్ టెస్టులో అతి భయంకరమైన విషయాలు.. వీడు మామూలోడు కదా..

Aghori Srinivas: అఘోరీ మెడికల్ టెస్టులో అతి భయంకరమైన విషయాలు.. వీడు మామూలోడు కదా..

Aghori Srinivas: లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఎపిసోడ్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలుకు చేరింది. చీటింగ్ కేసులో చేవెళ్ల కోర్టు అల్లూరి శ్రీనివాస్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. లెక్క ప్రకారమైతే సంగారెడ్డి సబ్ జైలులో ఉంచాలి అఘోరీని. ముందుగా అఘోరీ సంగారెడ్డి సబ్ జైలుకే తీసుకెళ్లారు. కానీ, అఘోరీ ఆడా? మగా? క్లారిటీ కావాలంటూ అక్కడి జైలు అధికారులు రిజెక్ట్ చేశారు. చేసేది లేక పోలీసులు మళ్లీ వైద్య పరీక్షలు చేయించారు.


వైద్య పరీక్షల్లో సంచలన విషయాలు..

వైద్యపరీక్షల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ట్రాన్స్‌జెండర్ ఫిమేల్ అని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. అఘోరీ వేషం కట్టిన అల్లూరి శ్రీనివాస్ రెండు సార్లు లింగమార్పిడి చేసుకున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే అలాంటి వారిని చేర్చుకోమంటూ ముందే చెప్పేశారు సంగారెడ్డి జైలు సిబ్బంది. తెలంగాణలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక బ్యారక్‌ కేవలం చంచల్‌గూడ జైల్లో మాత్రమే ఉంది. అందుకే, లేడీ అఘోరీని చివరికి చంచల్‌గూడకు తరలించారు. అక్కడి ట్రాన్స్‌జెండర్స్ సెల్‌ లో ఉంచారు.


అఘోరీ వద్దే ఉంటా..

అల్లూరి శ్రీనివాస్ కు కోర్టు రిమాండ్ విధించడంతో.. వర్షిణిని తాత్కాలికంగా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌ లో ఉంచారు. అయితే, తనను కూడా శ్రీనివాస్ వద్దకే పంపాలని శ్రీవర్షణి గొడవ చేస్తోంది. నానా హంగామా చేస్తుంది. అఘోరీ శ్రీనివాస్ తనకు వారం రోజుల్లో బయటకు వస్తా అని చెప్పినట్టు చెబుతోంది. తనను కూడా లేడీస్ జైల్లో ఉంచాలని వీరంగం సృష్టించింది. బీటెక్ కూడా కంప్లీట్ చేయించాలని.. ఆ బాధ్యత పోలీసులే తీసుకోవాలని వర్షిణి డిమాండ్ చేస్తోంది. అలా కుదరదు అంటున్న పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగుతోంది. అరుపులు, తిట్లు, ఏడుపులతో పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ చేస్తోంది.

వర్షిణి మానసిక పరిస్థితి బాగోలేదు..

వర్షిణి మానసిక ఆరోగ్యంపై ఏమాత్రం బాగోలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లు రీ హాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచి చికిత్స చేయించాలని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. దీనిపై  ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు వర్షిణి కోసం ఆమె తల్లిదండ్రులు శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తమతో ఇంటికి వచ్చేయాలని కూతురు వర్షిణిని వేడుకున్నారు.

పీఎస్ లో వర్షిణి నానా హంగామా..

అయితే, పేరెంట్స్‌తో వెళ్లేందుకు వర్షిణి ఇష్టం పడడం లేదు. అఘోరీ శ్రీనివాస్ తోనే ఉంటానని హంగామా చేస్తుంది. అవసరమైతే తన అత్తారింటికి వెళ్తానంటూ అరుస్తోంది. తల్లిదండ్రులతో ఉండేందుకు అసలు ఇష్టం చూపట్లేదు. తమ కూతురుని తమతో పంపించాలని పోలీసులను వేడుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. మంగళగిరి తీసుకెళ్తామని.. కావాలంటే అక్కడే రీ హాబిలిటేషన్ సెంటర్లో చేర్పిస్తామని వర్షణి పేరెంట్స్ చెబుతున్నారు. అయితే, వర్షిణిని మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని.. పేరెంట్స్ తో పంపించలేమని పోలీసులు చెప్పారు.

Also Read: Hyderabad Crime News: చేపల కూర కోసం ఏకంగా ఫ్రెండ్‌నే చంపాడు..

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×