Ind vs Pak : జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు మరణించిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో 28 మంది మరణించిన విషయం విధితమే. పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఫైర్ అయ్యారు. అమాయకులను చంపడమే ఆదేశ జాతీయ క్రీడగా మారిపోయిందని మండిపడ్డారు. ఇక ఇండియా-పాకిస్తాన్ మధ్య ఎప్పటికీ క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించవద్దని కోరారు. కొద్ది నెలల క్రితం తాను పహల్గామ్ వెళ్లానని.. అక్కడ శాంతి నెలకొన్నట్టు కనిపించిందని గుర్తు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోపీ కోసం పాకిస్తాన్ కు ఇండియా టీమ్ ని పంపించకపోవడాన్ని సమర్థించాడు.
Also Read : Energy Drink Capsules : ప్లేయర్లు తాగే నీళ్లలో టాబ్లెట్లు.. అందుకే అంతలా పరిగెడతారా..!
ముఖ్యంగా పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాను అక్కడికీ పంపనందుకు కొందరూ ఏదేదో మాట్లాడారు. రాజకీయాల కంటే క్రీడలే ఎక్కువ అన్నారు. మరీ ఇప్పుడు జరిగింది ఏంటి..? అని ప్రశ్నించారు. భారతీయులను చంపడమే వాళ్లకు జాతీయ క్రీడ అయింది. వాళ్లు అలాగే ఆడితే మనం కూడా అదే భాషలో సమాధానం చెప్పాలి. అంతేకానీ బ్యాట్ లు, బంతులతో కాదు.. సంకల్పం, సహనంతో సమాధానం చెప్పాలి అన్నారు. “నాకు చాలా కోపంగా ఉందని.. ఎంతో బాధపడుతున్నాను. గత కొద్ది రోజుల కింద నేను పహల్గామ్ వెళ్లి స్థానికులతో మాట్లాడాను. వాళ్లలో మళ్లీ చిగురించిన ఆశను చూశాను. అక్కడ శాంతి తిరిగి వచ్చిందనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ రక్తపాతం పారింది. ఇది మనస్సును కుదిపేస్తుంది. మనవాళ్లు చనిపోతుంటే ఎన్నిసార్లు మౌనంగా, క్రీడా భావనతో ఉండమంటారా..? ఇక చాలు.. ఈసారి అలా ఉండదు” అంటూ రాసుకొచ్చాడు శ్రీవాత్సవ్.
మరోవైపు ఇవాళ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ( Sunrisers Hyderabad vs Mumbai Indians ) జరుగుతోంది. అయితే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ చీర లీడర్స్ లేకుండానే మ్యాచ్ జరుగుతోంది. అదేవిధంగా గెలిచిన తరువాత సెలబ్రేషన్స్ ఉండవని.. నల్ల బ్యాడ్జీలు ధరించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్క నిమిషం మౌనం పాటించారు. ఇవాళ బ్లాక్ రిబ్బన్లను ధరించి ఉగ్రవాదుల దాడి లో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ముంబై ఇండియన్స్. ముంబై జట్టు వరుస విజయాలతో మంచి ఫామ్ లో కొనసాగుతోంది. వరుసగా హ్యా ట్రిక్ విజయాలను సాధించింది. ఇవాళ విజయం సాధిస్తే.. డబుల్ హ్యాట్రిక్ పై దృష్టి సారించినట్టయింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులకు నిరసన గా నివాళులర్పిస్తున్నారు.
ENOUGH!!!! pic.twitter.com/1fF6XUhgng
— Shreevats goswami (@shreevats1) April 22, 2025