Vijaya Shanthi : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమా కూడా ప్రపంచ స్థాయికి ఎదిగిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో చాలామంది తెలుగు పరిశ్రమంలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తెలుగు హీరోయిన్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అయినా కానీ కొంతమంది దర్శకులు తెలుగు హీరోయిన్లకే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఇంద్రకంటి మోహన్ కృష్ణ వంటి దర్శకులు తమ సినిమాల్లో తెలుగు హీరోయిన్లు ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తారు. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది ఇతర భాష హీరోయిన్లు మంచి గుర్తింపు సాధించుకొని, నేటికీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు.
లేడీ సూపర్ స్టార్
ఇప్పుడు లేడీస్ సూపర్ స్టార్ అంటే చాలామందికి గుర్తొచ్చేది నయనతార (Nayanatara). తెలుగులో నయనతార చాలా సినిమాలు చేశారు. మంచి సినిమాలు చేసి గుర్తింపును కూడా సాధించుకున్నారు. ఇక తర్వాత కాలంలో నయనతార మెల్లమెల్లగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం నయనతార క్రేజీ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే కొంతమంది నయనతారను లేడీ సూపర్ స్టార్ అంటారు. వాస్తవానికి ఈ ట్యాగ్ ముందు విజయశాంతికి ఉండేది. ఆ టైంలో కర్తవ్యం, ప్రతిఘటన వంటి సినిమాలు తర్వాత హీరో రేంజ్ లో ఈమెకి గుర్తింపు లభించింది. ప్రతిఘటన సినిమా తర్వాత విజయశాంతి లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును దక్కించుకుంది.
Also Read : Kiran Korrapati : తెలుగులో ఫెయిల్ అయ్యాడు, బాలీవుడ్ లో ప్రాజెక్టు పట్టుకున్నాడు
ఆ ట్యాగ్ లాక్కున్నారు
అయితే తాను సినిమాలకి కొద్దికాలం గ్యాప్ ఇవ్వటం వలన కొందరు ఆ ట్యాగ్ అంకితం చేసుకున్నారు. ప్రస్తుతం నయనతార, సమంత (Samantha), త్రిష(Trisha) వంటి హీరోయిన్స్ అంతా కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ టాగ్ ను కూడా కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. దీనిపై విజయశాంతి స్పందించారు. ప్రతిఘటన (Prathighatana) సినిమా తర్వాత నాకు ఆ ట్యాగ్ వచ్చింది ఇప్పుడు చాలామంది దాన్ని వాడుకుంటున్నారు. నేను ఎప్పుడూ వాళ్ళ గురించి రియాక్ట్ అవలేదు. పాపం వాళ్లు కూడా బతకాలి కదా అంటూ ఊరుకున్నాను అంటూ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు విజయశాంతి. అయితే ఈ మాటలను కొంతమంది పట్టించుకోనట్లు వదిలేస్తారా పట్టించుకుని తిరిగి సమాధానం ఇస్తారా అనేది కొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది.
Also Read : దాని వల్లే టెర్రరిస్ట్ ఎటాక్.. మెహబూబ్, సోహెల్‌కు అన్ని కోట్లు ఎలా? అన్వేష్ సంచలన వీడియో