Sree Vishnu: చాలామంది హీరోలకు అభిమానులు ఉండటం అనేది సహజంగా జరుగుతుంది. కానీ కొంతమంది హీరోలు కూడా వేరే హీరోలకు అభిమానులై ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలకు చాలామంది ప్రస్తుత హీరోలే అభిమానులుగా ఉన్నారు. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో శ్రీ విష్ణు ఒకడు. శ్రీ విష్ణు కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. కానీ సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు స్ట్రెంత్ కామెడీ అని చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. ఆ సినిమాలో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ అద్భుతంగా వర్కౌట్ అయింది. అక్కడితో శ్రీ విష్ణు హీరోగా ప్రతి దర్శకుడు కూడా ఒక కామెడీ కథను రెడీ చేయడానికి సిద్ధమైపోయాడు. ప్రస్తుతం సింగిల్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు శ్రీ విష్ణు.
విభిన్నమైన కథలు
శ్రీ విష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సినిమా మెంటల్ మదిలో. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బ్రోచేవారెవరురా సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అం సెన్సార్ర్డ్ వెర్షన్ అనుకోకుండా అమెరికాలో ప్లే అవ్వడంతో శ్రీ విష్ణుకి ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత శ్రీ విష్ణు సినిమాలలో బూతులు గమనించడం మొదలుపెట్టారు చాలామంది ఆడియన్స్. సామజవరగమన సినిమా విషయానికి వస్తే సెన్సార్ దాటి శ్రీ విష్ణు మాట్లాడిన మాటలు చాలామందికి ఒక రకమైన థ్రిల్ ఇచ్చాయి.
ఆ మాటలు నావి కాదు
ప్రభాస్ కెరియర్ లో సలార్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రభాస్ కటౌట్ ను అద్భుతంగా వాడుకున్నాడు. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ కు మంచి కం బ్యాక్ ఫిలిం అయింది. అయితే ఈ సినిమా చూడడానికి యు వి క్రియేషన్స్ వంశీ శ్రీ విష్ణు కలిసి హైదరాబాద్ మూసాపేట్ లో ఉన్న శ్రీరాములు థియేటర్ కి వెళ్లారు. ప్రభాస్ వెళ్ళమని చెప్పారట. అయితే సలార్ సినిమా చూసిన శ్రీవిష్ణు తను కూడా ఒక హీరో అనే విషయాన్ని మర్చిపోయి విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోని ఒక ఆడియన్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో పొద్దున్నకల్లా వైరల్ గా మారిపోయింది. అదే వీడియోకు “రెబల్ అంటే రాజే రా, రాజంటే రెబలేరా” అనే వేరే ఆడియోను అటాచ్ చేశారు. అప్పట్లో ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో ఉన్నది మాత్రం నేనే కానీ ఆ ఆడియో మాత్రం నేను కాదు ఎవరు ఎడిట్ చేశారు అంటూ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు శ్రీ విష్ణు.
Also Read :Pawan Kalyan : ఆ సీన్స్ తీసేయండి, ఉస్తాద్ భగత్ సింగ్ లో భారీ మార్పులు