BigTV English

Three Women Died : ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మహిళలు మృతి

Three Women Died : ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మహిళలు మృతి

Three Women Died in Road Accident : ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మరణించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్న బొకూర్ గ్రామానికి చెందిన మల్యాల వెంకటేశ్ అనే వ్యక్తి మియాపూర్ గ్రామం చివరిలో తనకు ఉన్న వ్యవసాయ భూమిలో మొక్కజొన్న కంకుల పొట్టు తీసేందుకు తన భార్య సహా.. 8 మంది మహిళా కూలీలను ట్రాక్టర్ లో తీసుకెళ్లారు.


పొలం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా.. ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో పోచంపల్లి రాజమ్మ, భేతి లక్ష్మి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. వెంకటేశ్ భార్య అయిన వైష్ణవి తీవ్రగాయాల పాలవ్వగా.. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. మిగతా కూలీలకు సైతం గాయాలవ్వడంతో వాళ్లందరినీ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Big Stories

×