BigTV English

CLP Meeting: సీఎల్పీ మీటింగ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన మహేశ్ కుమార్ గౌడ్

CLP Meeting: సీఎల్పీ మీటింగ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud Comments in CLP Meeting: టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మాదాపూర్ లో సీఎల్పీ సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ.. ‘పీసీసీ అధ్యక్ష పదవిని ఒక బాధ్యతగా భావిస్తా. పార్టీని ముందుకు నడపడంలో సమిష్టి బాధ్యత అవసరమని నేను నమ్ముతున్నా. కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటా. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటా. కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. జిల్లా ఇంచార్జ్ మంత్రులపై ఎక్కువ బాధ్యత ఉంది. స్థానిక సంస్థల్లో 90 శాతం స్థానాలను గెలవాలి. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోంది. కార్యకర్తలను సమాయత్తం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం.


Also Read: ఈ విషయం మంత్రి పొన్నంకు గుర్తులేదేమో… కానీ, కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసు: హరీశ్‌రావు

నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో మమేకమై పనిచేశాం. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలను పార్టీ, ప్రజాప్రతినిధులు జనంలోకి తీసుకెళ్లాలి. కేసీఆర్ అబద్దాలతో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు. కేసీఆర్ పదేళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయాడు. రాహుల్ గాంధీ ఈ దేశానికి ఆశాకిరణం… రాహుల్ ను ప్రధాని చేయడమే ధ్యేయంగా అంతా పనిచేయాలి. ప్రధాని మోదీకి భవిష్యత్తు లేదు. కులం,మతం పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తున్నారు.. వారిని చైతన్యపరచాలి. రాహుల్ గాంధీతో చేయి కలిపి ముందుకు సాగాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఆశీస్సులు ఎప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కు ఉంటాయి. కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకొని ముందుకు వెళ్తా. రెండోసారీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అంటూ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.


Also Read: ప్రారంభమైన సీఎల్పీ సమావేశం.. ఎవరెవరు హాజరయ్యారంటే?

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×