Deepa Dasmunsi: హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఒక కాంగ్రెస్ నేతగా కూడా అందరికీ తెలిసిన విషయమే. తాజాగా చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి కేసులో ఉన్న విషయం కూడా తెలిసిందే. గత రెండు రోజులుగా బన్నీ కేసుపై అల్లు అర్జున్ క్లారిఫికేషన్స్, పోలీస్ వర్షన్స్ ఇలా వార్తల్లో నిలుస్తున్నాయి. హీరో అల్లు అర్జున్ ఈ కేసు నుండి ఎలా బయటపడాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి ఓ చేదు అనుభవం ఎదురైంది.
హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్దకు ఏఐసిసి ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ సోమవారం వచ్చారు. ఆయనను ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలుస్తున్నారు. పార్టీ విషయాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మున్షి తో కరచాలనం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై సవివరంగా వివరిస్తున్నారు. అంతలోని బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా అక్కడికి వచ్చారట. ఎలాగైనా మున్షినీ కలవాలని వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి, ఆ రీతిలో ప్రయత్నించారు. కానీ దీపా దాస్ మున్షీ మాత్రం చంద్రశేఖర్ రెడ్డిని కలిసేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది.
Also Read: Parliament Ambedkar Row: అమిత్ షా రాజీనామా చేయాల్సిందే, కాంగ్రెస్ డిమాండ్
దీనితో ఖంగు తిన్న చంద్రశేఖర్ రెడ్డి, తాను ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నానంటూ స్థానిక నేతలకు చెప్పి, అక్కడి నుండి వెళ్లిపోయారట. అసలు చంద్రశేఖర్ రెడ్డి కలిసేందుకు వచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమో కానీ, మున్షీ మాత్రం భేటీ అయ్యేందుకు అంత ఆసక్తి చూపలేదన్నది వాస్తవం. మరి ఈ భంగపాటుకు చంద్రశేఖర్ రెడ్డి ఆలోచన మారనుందా? కేసు వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి తనను కలవలేదని భావిస్తారా? అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది