BigTV English

Mulugu : రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి.. మంత్రి సీతక్క పరామర్శ..

Mulugu : రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి.. మంత్రి సీతక్క పరామర్శ..

Mulugu : ములుగు జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్సీ కాలనీలో కొందరు యువకులు కలిసి ఇనుప పోల్‌కు జాతీయ జెండాని ఎగరవేయాలని భావించారు. అయితే జాతీయ జెండాను అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి బోడ విజయ్(25) అంజిత్‌(35) చక్రి (25)‌లు విద్యుతాఘాతానికి గురయ్యారు.


స్థానికులు హుటాహుటిన బాధితులను ములుగు ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే విజయ్, అజిత్‌లు మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. స్వల్ప గాయాలతో చక్రి క్షేమంగా ఉన్నట్టు వైద్యలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యుతఘాతంతో ఇద్దరు మృతి చెందడంతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతుల కుటుంబాలను మంత్రి సీతక్క పరామర్శించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద పదివేలు అందజేశారు. విద్యుత్ శాఖ తరపున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం అందేలా చూస్తానని, వారి కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి సీతక్క బాధిత కుటుంబాలకు హమీ ఇచ్చారు.


Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×