BigTV English

Airplane Accident : బేగంపేటలో విమాన ప్రమాదం – సీఎం టూర్‌కు ముందు ఘటన

Airplane Accident : బేగంపేటలో విమాన ప్రమాదం – సీఎం టూర్‌కు ముందు ఘటన

Airplane Accident : హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఇక్కడి నుంచి ట్రైనింగ్ విమానాలు రాకపోకలు ఎక్కువగా సాగిస్తుంటాయి. అలా వెళ్లిన ఓ విమానం.. తిరిగి ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో కొందరు ఫోటోలు, వీడియోలు తీయగా.. అవి ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.


గాల్లో చక్కర్లు కొట్టిన ఓ విమానం తిరిగి ల్యాండ్ అవుతుండగా.. ఎయిర్ క్రాఫ్ట్ అదుపు తప్పింది. దాంతో.. రన్ వే నుంచి పక్కకు ఒరిగిపోవడంతో పాటు దాని ముందు భాగం రన్ వే కు  తాకినట్లుగా వీడియోల్లో స్పష్టం కనిపిస్తోంది. వాస్తవానికి ట్రైనింగ్ విమానాల్లో ప్రొఫెల్లర్ విమానానికి ముందు భాగంలో ఉంటుంది. దాంతో..  ప్రమాద తీవ్రత పెరిగే అవకాశాలుంటాయి . కానీ.. ప్రస్తుత ప్రమాదంలో విమానంలోని ట్రైనీ పైలట్ సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. అయితే.. ఈ ప్రమాదంలో  ఎయిర్ క్రాఫ్ట్ చక్రం రన్ వే ను ఢీ కొట్టి .. ఈడ్చుకుని వెళ్లినట్లుగా చెబుతున్నారు. దాంతో.. రన్ వే కొంత మేర దెబ్బతిన్నట్లుగా గుర్తించారు.

ఎయిర్ క్రాఫ్ట్ ఘటన తర్వాత ఎయిర్ పోర్టు సిబ్బంది తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న రన్ వే ను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. కాగా.. ఈ ఘటన తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది.


సీఎం పర్యాటనకు ముందు ప్రమాదం..

బెగంపేట విమానాశ్రయం నుంచి మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఇప్పటికే.. అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇలాంటి సమయంలో విమాన ప్రమాదం జరగడం, రన్ వే దెబ్బ తినడం వంటి ఘటనలు జరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్ పోర్టు అధికారులతో పాటు ఇతర భద్రతా సంస్థల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సీఎం పర్యాటన సైతం కాస్త ఆలస్యంగానే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్ లో  కూలిన యుద్ధ విమానం.. 

మరో విమాన ప్రమాదం మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. శివపురి సమీపంలో మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన విమానం ప్రమాదవశాత్తూ పొలాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారణకు సైన్యం ఆదేశించింది.

ఈ విషయాన్ని సైన్యం కూడా ధృవీకరించింది. అత్యాధునిక యుద్ధ విమానాలుగా పేరు గాంచిన మిరాజ్ ఫైటర్ జెట్లు.. ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రెండు సీట్లు ఉండే ఈ యుద్ధ విమానాన్ని శిక్షణ కోసం వినియోగిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విమానాల్ని ఫ్రాన్స్ కు చెందిన డసాల్డ్ ఏవియేషన్ నిర్మిస్తోంది. ఈ మల్టీరోల్ ఫైటర్ జెట్ తొలిసారిగా 1978లో గాల్లోకి ఎగిరింది. అప్పటి నుంచి క్రమంగా అభివృద్ధి చేస్తూ వస్తున్న ఈ విమానం..1984లో ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ లోకి జాయిన్ అయ్యింది. కాగా.. ఇప్పటి వరకు 600 లకు పైగా ఈ రకం యుద్ధ విమానాల్ని ఉత్పత్తి చేయగా.. వాటిలో మెజార్టీ భారత్ సహా ఎనిమిది దేశాలు దిగుమతి చేసుకుని వినియోగిస్తున్నాయి. ఇటీవలే.. ఈ మిరాజ్ యుద్ధ విమానాల కోసం భారత్ మరోసారి ఆర్డర్లు పెట్టింది.

Also Read : వారికి CM రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.. మళ్ల గిట్ల రిపీట్ అయితే..?

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×