Big Stories

Telangana Heat Wave: రాష్ట్రంలో భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

TS Weather

- Advertisement -

Heat Wave in Telangana: గత వారం రోజులుగా తెలంగాణ ప్రజలపై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే రానున్న ఐదు రోజులు సూర్యుడు మరింత మండనున్నాడని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరుకుంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

- Advertisement -

గత వారం రోజులుగా రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే ఐదు రోజులు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చిరించారు. పగటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 42 డిగ్రీలకు చేరువలో ఉండగా.. అవి ఈ 5 రోజుల్లో 45 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలు నమోదవుతున్నాయని తెలిపింది.

ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 నుంచి 3 మూడు రోజులు ఈ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలా, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కుమ్రంభీం, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, నారయణ పేట, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజె అలర్ట్ జారీ చేసింది.

Also Read: CM Revanth Reddy: 100 రోజుల పాలనకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం.. టార్గెట్ 14 ఎంపీ సీట్లు..

రాగల ఐదు రోజ్లులో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 40 డిగ్రీలకు చేరువయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆదిలాబాద్ జిల్లా సత్నాల, తలమడుగులో అత్యధికంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News