
TSPSC : పశుసంవర్ధకశాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీజోన్-1, మల్టీజోన్-2లో ఖాళీలను భర్తీ చేస్తారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ) పోస్టులు 170 , వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి) పోస్టులు 15 ఉన్నాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 44 సంవత్సరాలు మించరాదు. ఉద్యోగులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుంను రూ. 320గా నిర్ణయించారు. 2022 డిసెంబర్ 30 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 2023 జనవరి 19లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. 2023 మార్చి 15, 16 తేదీల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ): 170 పోస్టులు
అర్హత : బ్యాచిలర్ డిగ్రీ (వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హజ్బెండరీ) లేదా తత్సమాన విద్యార్హత - వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి) : 15 పోస్టులు
అర్హత : బ్యాచిలర్ డిగ్రీ (వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హజ్బెండరీ), పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పీజీ
డిప్లొమా (మైక్రోబయాలజీ/ పారాసిటాలజీ/ ఎపిడెమియాలజీ/ వైరాలజీ/ ఇమ్యునాలజీ/ పాథాలజీ) లేదా మాస్టర్స్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్) లేదా ఎంవీఎస్సీ (వెటర్నరీ పబ్లిక్ హెల్త్)
వయసు : 01/07/2022 నాటికి 44 సంవత్సరాలు మించరాదు
వేతన శ్రేణి : నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630
ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా .పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్-2లో వెటర్నరీ సైన్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి. పేపర్-1లో 150 ప్రశ్నలకు 150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలకు 300 మార్కులు. మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు+ పరీక్ష రుసుం : రూ.320
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 30-12-2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19-01-2023
రాతపరీక్ష తేదీలు: 2023 మార్చి 15, 16
వెబ్‌సైట్: https://websitenew.tspsc.gov.in/