BigTV English

Ram Charan Vijay Deverakonda: డైర‌క్ట‌ర్ల‌ను మార్చుకుంటున్న రామ్‌చ‌ర‌ణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

Ram Charan Vijay Deverakonda: డైర‌క్ట‌ర్ల‌ను మార్చుకుంటున్న రామ్‌చ‌ర‌ణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

Ram Charan Vijay Deverakonda:సినిమా ఇండ‌స్ట్రీలో ఫ్రెండ్‌షిప్‌లు ఎక్కువైపోతున్నాయి. యంగ్‌స్ట‌ర్స్ అంద‌రూ క‌లిసిక‌ట్టుగా మూవీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. రిలీజుల విష‌యంలోనూ, రికార్డుల విష‌యంలోనూ పోటీలు ఉంటున్నా, ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లోనూ, ప్రాజెక్టుల‌ను సెట్ చేసుకునే విష‌యంలోనూ మ్యూచువ‌ల్ అండ‌ర్‌స్టాండింగ్‌తో మ‌స‌లుకుంటున్నారు.


ఇప్పుడు లేటెస్ట్ గా ఈ స‌ర్కిల్‌లో చేరిపోయారు విజ‌య్ దేవ‌ర‌కొండ అండ్ రామ్‌చ‌ర‌ణ్‌. అన్నీ ప‌ర్ఫెక్ట్ గా అనుకున్న ప్ర‌కార‌మే జ‌రిగి ఉంటే శంక‌ర్ మూవీ కంప్లీట్ కాగానే రామ్‌చ‌ర‌ణ్ వెళ్లి గౌత‌మ్ తిన్న‌నూరి సెట్స్ లో జాయిన్ అవ్వాలి. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు. శంక‌ర్ సినిమా కంప్లీట్ కాగానే చ‌ర‌ణ్ ఎటు వెళ్తార‌నే హింట్ ఇప్ప‌టిదాకా ఆయ‌న వైపు నుంచి లేదు. కానీ నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడుతూ చ‌ర‌ణ్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో సినిమా కోసం తాను ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాన‌ని, త‌న‌కు ఓపెనింగ్ సీన్ ఆల్రెడీ తెలుసున‌ని రాజ‌మౌళి చెప్పారు. ఆఫ్ట‌ర్ శంక‌ర్ మూవీ సుకుమార్ సెట్స్ కి వెళ్తారు చ‌ర‌ణ్‌.

పుష్ప‌2 గ‌నుక ఈ పాటికి రిలీజ్ అయిపోయి ఉంటే, వెంట‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయాలి సుకుమార్‌. అదీ డీల్‌. స‌మంత‌కు హెల్త్ ఇష్యూ లేకుండా ఉంటే ఈ పాటికే ఖుషీని రిలీజ్ చేయాలి విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 2023 ఫ‌స్ట్ క్వార్ట‌ర్‌లోనే సుకుమార్ అండ్ విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా స్టార్ట్ కావాలి. కానీ ఏదీ అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌లేదు. అందుకే ఇప్పుడు సుకుమార్ అండ్ విజ‌య్ సినిమా డైల‌మాలో ప‌డింది. 2023 ఎండింగ్ వ‌ర‌కు పుష్ప‌2తో సుకుమార్ బిజీ. ఆ త‌ర్వాత చ‌ర‌ణ్ సినిమా చేయాలి. సో విజ‌య్ మూవీకి వ‌ర్క్ చేసే స్కోప్ ఇప్ప‌ట్లో లేన‌ట్టే.


అందుకే గౌత‌మ్ తిన్న‌నూరి క‌థ విని, డేట్లు ఇవ్వాల‌ని అనుకుంటున్నార‌ట విజ‌య్ దేవ‌ర‌కొండ‌. క‌థ నచ్చితే చెర్రీ డైర‌క్ట‌ర్‌తోట్రావెల్ చేయ‌డానికి రౌడీ హీరో రెడీగా ఉన్నార‌నే మాట‌లూ ఉన్నాయి. అద‌న్న‌మాట సంగ‌తి… విజ‌య్ దేవ‌ర‌కొండ అనుకున్న సుకుమార్‌తో చెర్రీ, చెర్రీ అనుకున్న గౌత‌మ్ తిన్న‌నూరితో విజ‌య్ సినిమాలు ఫిక్స్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌న్న‌మాట‌.

Related News

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Big Stories

×