E-Paper
Advertisement

Metro: హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ మెట్రో.. ఎంత దూరమంటే..

Metro: హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ మెట్రో.. ఎంత దూరమంటే..
Advertisement

Metro: హైదరాబాద్ మెట్రో రైలు గ్రాండ్ సక్సెస్ అయింది. భారీగా ప్రయాణీకుల ఆదరణ లభిస్తోంది. ప్రతీరోజు సుమారు 4 లక్షలకు పైగానే ప్యాసింజర్లు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన ఈ ఐదేళ్లలో 31 కోట్ల మంది ట్రావెల్ చేశారు.

హైదరాబాద్ మెట్రోను మరింత దూరం పొడిగించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 31 కిలో మీటర్ల దూరం మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

ఇక, మెట్రో రెండో దశలో మరో హైలెట్ విషయం ఉంది. అదే, అండర్ గ్రౌండ్ మెట్రో. విమానాశ్రయం సమీపంలో ఏకంగా 2.5 కిలోమీటర్ల దూరం భూగర్భ మెట్రోను నిర్మించనున్నారు.

రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్‌కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.

Advertisement

అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో హైదరాబాద్ మెట్రో రైల్‌ ఐదేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరవాసుల నుంచి మెట్రోకు మంచి స్పందన వస్తుందని ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో 69.2 కి.మీ. మేర మెట్రో నడుస్తోందన్నారు.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×