Hyderabad : ఉప్పల్ భగయత్ శిల్పారామం దగ్గర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూర్తి కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మంటలు చెలరేగటంతో పరుపులు గౌడన్ లో మంటలు వ్యాపించాయి.
ఉప్పల్ శిల్పారామం సమీపంలో ఉన్న ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. భగవత్ శిల్పారామం దగ్గర ఉన్న మూర్తి కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరుపులు గౌడన్ మొత్తం మంటలు అంటుకున్నాయి. పరుపులు దుకాణం కావడంతో మంటలు తీవ్ర స్థాయిలో వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న సామాన్లన్నీ మంటల్లో కాలిపోయినట్టు తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలని అదుపు చేసే ప్రయత్నం చేశారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసినప్పటికీ పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుండగా.. పరుపుల దుకాణంలో ఉన్న వారు మాత్రం వెంటనే అప్రమత్తమై బయటపడినట్టు స్థానికులు చెబుతున్నారు. భారీగా పొగ ఎగిసి పడటంతో… మంటల ధాటికి స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెల రేగటంతో గమనించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించామని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ALSO READ : రైల్వేలో రాష్ట్రానికి నిరాశ.. బడ్జెట్ లో కనిపించని రాష్ట్రం ప్రస్తావన