BigTV English

Vande Bharat: తెలుగు లోగిళ్లలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఇక ప్రయాణం పండగే..

Vande Bharat: తెలుగు లోగిళ్లలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఇక ప్రయాణం పండగే..

Vande Bharat: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలుగు రాష్ట్రాల్లో హైస్పీడ్ తో దూసుకెళ్లింది. ఢిల్లీలో ప్రధాని మోదీ పచ్చజెండా ఊపగానే.. ఇక్కడ సికింద్రాబాద్ లో వందేభారత్.. కూత పెట్టింది. చుక్ చుక్ అనకుండానే.. జెట్ స్పీడ్ తో పట్టాలపై పరుగులు పెట్టింది. అలా, తొలి సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరంభమైంది.


సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు అందుబాటులో ఉండనుంది.

‘‘పండగ వాతావరణంలో తెలుగు రాష్ట్రాలకు వందేభారత్‌ గొప్ప కానుక. తెలుగు ప్రజలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రైలు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి దోహదపడుతుంది. హైదరాబాద్‌- వరంగల్‌ – విజయవాడ – విశాఖ నగరాలను అనుసంధానిస్తూ ప్రయాణం సాగుతుంది. సికింద్రాబాద్‌ – విశాఖ మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. పూర్తిగా దేశీయంగా తయారైన వందేభారత్‌తో బహుళ ప్రయోజనాలున్నాయి. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. భద్రతతో పాటు రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. 2023లో ప్రారంభిస్తున్న తొలి వందేభారత్‌ రైలు ఇది. మారుతున్న దేశ భవిష్యత్తుకు ఇదొక ఉదాహరణ’’ అంటూ పీఎం మోదీ తెలుగు ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు.


వారంలో ఆరు రోజులు ఉదయం 5.45 గంటలకు విశాఖలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ (20833) బయలు దేరుతుంది. మధ్యాహ్నం 2.15 కల్లా సికింద్రాబాద్ చేరుతుంది. తిరిగి సికింద్రాబాద్ లో (20834) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై.. రాత్రి 11.30కి విశాఖ చేరుతుంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×