BigTV English

Balakrishna: నన్ను మన్నించండి.. ఎమ్మెల్యే బాలకృష్ణ పశ్చాత్తాపం.. ఎందుకంటే?

Balakrishna: నన్ను మన్నించండి.. ఎమ్మెల్యే బాలకృష్ణ పశ్చాత్తాపం.. ఎందుకంటే?

Balakrishna: బాలకృష్ణ అంటే సినిమాలు, డ్యాన్సులు, నరకడాలు, ఫ్యాక్షన్, పంచ్ డైలాగులు, అభిమానులను కొట్టడాలు.. ఇవే కావు. ఆయనలో మరో మనిషి ఉన్నాడు. మంచి మనిషి దాగున్నాడు. పెద్దలంటే గౌరవం.. పిల్లలపై ప్రేమ.. అభిమానులపై ఆప్యాయత.. అబ్బో సకల సుగుణాభిరాముడు మన బాలయ్య..అని ఆయన దగ్గరి వాళ్లు అంటుంటారు. కాకపోతే, కాస్త దూకుడెక్కువ. చేతికి, నోటికి కాస్త కంట్రోల్ తక్కువ. అలానే, ఇటీవల బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఓ వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ విషయం తెలిసి.. బాలయ్య తనను మన్నించమని వేడుకున్నారు. తన పశ్చాత్తాపాన్ని ప్రకటించి.. మంచి మనసును చాటుకున్నాడు.


దేవ బ్రాహ్మణులపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) వివరణ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో తాను అలా మాట్లాడానని అన్నారు. ఎదుటివాళ్లను బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.

‘‘నా మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి బాధపడ్డా. నాకు ఎవరినీ బాధపెట్టాలన్న ఆలోచన లేదు. నేను ఎదుటివాళ్లను బాధపెట్టే వ్యక్తిని కాదని మీకు తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలా మాట్లాడాను. సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకేం ప్రయోజనం? నా వాళ్లను నేను బాధ పెట్టుకుంటానా? అర్థం చేసుకుని నా పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మరి, దేవాంగులు ఎలా స్పందిస్తారో చూడాలి.


ఇంతకీ దేవాంగుల గురించి బాలకృష్ణ ఏమన్నారంటే.. ‘దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ’

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×