E-Paper
Advertisement

Dangerous Train Stunts: మీ రీల్స్ ప్రాణం తీస్తాయ్ జాగ్రత్త.. సోషల్ మీడియా స్టంట్లపై సీపీ సజ్జనార్ సీరియస్ హెచ్చరిక

Dangerous Train Stunts: మీ రీల్స్ ప్రాణం తీస్తాయ్ జాగ్రత్త..  సోషల్ మీడియా స్టంట్లపై సీపీ సజ్జనార్ సీరియస్ హెచ్చరిక
Advertisement

Dangerous Train Stunts: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యాసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మరోసారి తన ఆందోళన వ్యక్తం చేశారు. నడుస్తున్న రైలుకు వేలాడుతూ స్టంట్లు చేస్తున్న ఒక వీడియోను ఉద్దేశించి ఆయన ఘాటుగా స్పందించారు. ఈ రకమైన చర్యలు చూస్తుంటే యువతకు ప్రాణం మీద తీపి కంటే.. ఫోన్లో వచ్చే లైకుల మీద ఆశే ఎక్కువైపోయినట్టు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి తెలివితక్కువ పనుల వల్ల ఆ యువకుడికి దక్కేది కేవలం ఆసుపత్రి బెడ్ లేదా అంతిమయాత్ర మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

యువత తన పిచ్చి విన్యాసాలకు ప్రాణం పోయే వరకు వేచి చూస్తుందా అని సజ్జనార్ నిలదీశారు. ఇంట్లో తమ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసే తల్లిదండ్రులు.. కుటుంబ సభ్యుల గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించారా అని ఆయన ప్రశ్నించారు. లైకుల కోసం జీవితాన్ని రిస్క్ చేయాల్సిన అవసరం లేదని, ఒక్కసారి ప్రాణం పోయాక ఆ రీల్స్ ఎవరూ చూడరని, కానీ ఆ కుటుంబం మాత్రం జీవితాంతం కన్నీళ్లు పెడుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా రోడ్లపై స్టంట్లు చేసే వారిపై సజ్జనార్ ఇటువంటి హెచ్చరికలే జారీ చేశారు.

Advertisement

ప్రస్తుత సమాజంలో వర్చువల్ ప్రపంచంలో గుర్తింపు కోసం వాస్తవ ప్రపంచంలో ప్రాణాలను పణంగా పెట్టడం ఒక సామాజిక రుగ్మతగా మారుతోంది. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. యువత తమ శక్తిని.. సృజనాత్మకతను నిర్మాణాత్మకమైన పనుల కోసం ఉపయోగించాలని ఆయన హితవు పలికారు. సోషల్ మీడియా అనేది సమాచార మార్పిడికి.. విజ్ఞానానికి వేదిక కావాలి తప్ప, ఆత్మహత్యాయత్నాలకు కాదని ఆయన తన పోస్ట్ ద్వారా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.

Advertisement

Read Also: ఢిల్లీలో దారుణం.. హోలీ వేడుకల్లో గొడవ, యువకుడిని దారుణంగా చంపారు

Related News

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×