E-Paper
Advertisement

Bhatti Vikramarka: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పై భట్టి విక్రమార్క ఫైర్..!

Bhatti Vikramarka: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పై భట్టి విక్రమార్క ఫైర్..!
Advertisement

Bhatti Vikramarka: స్వేఛ్చ బ్యూరో: పదేళ్ల దోపిడీకా..? అభివృద్ధి, సంక్షేమానికా..? ఆలోచించి ఓటు వేయాలని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఆదివారం పలు మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. “ప్రతి పైసా పోగు చేస్తాం.. పేదలకు పంచుతాం. పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం” మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమం దిశగా పనిచేసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ప్రతి పైసా పేదల కోసమే ఖర్చు చేస్తాం అన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో భారీ ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్నితీవ్రంగా విమర్శించారు.

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు, ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ముంచినందుకు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలా? వారి పరిపాలన ముగిసిపోయింది, వారి పాలన చాలని ప్రజలు విసిగి చెంది ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు లేదా ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అర్హత కలిగిన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, పేదల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Advertisement

Also Read: RajaSaab: ఏంటీ ఇన్ని తప్పులా.. చూసుకోవాలిగా మారుతి.. ఆడేసుకుంటున్న ఫ్యాన్స్!

ఉద్యోగ నియామక పత్రాలు

పేదలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించేలా చేస్తాం. పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేస్తాం. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాల్లో 1.02 కోట్లకు ఉచిత సన్న బియ్యం 6 కిలోల చొప్పున అందిస్తున్నాంమని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో గ్రూప్-1, 2, 3 పరీక్షలు విజయవంతంగా, పారదర్శకంగా నిర్వహించి, ప్రజల సమక్షంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం , ఇప్పటి వరకు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, అభివృద్ది ప్రయాణం కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Advertisement

Also Read: Sankranthi 2027 Releases: 2027 సంక్రాంతికి సిద్ధమైపోయిన సీనియర్ బ్యాచ్.. ఈసారి విజేత ఆ హీరోనేనా..?

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×