BigTV English

Telugu Parties : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. తెలుగు పార్టీల వ్యూహమేంటి..?

Telugu Parties : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. తెలుగు పార్టీల వ్యూహమేంటి..?
Telugu states political parties news

Telugu states political parties news(Latest political news in India) : ఓవైపు ఎన్డీయే… మరోవైపు ఇండియా . మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల సంగతేంటి? ఇప్పుడీ ఇదే చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయేపై ఇండియా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కూటమిలో ఉన్న 26 పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాని వైసీపీ,టీడీపీ, బీఆర్‌ఎస్‌ ఎవరికీ మద్దతు ఇవ్వలేదు.


విపక్ష కూటమితోపాటు.. బీఆర్‌ఎస్‌ కూడా వేరుగా అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. మణిపూర్ లో అల్లర్లపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. అయితే బీఆర్‌ఎస్‌ కు 9 మంది ఎంపీలు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు ఉండాలి. వీరి తీర్మానానికి హైదరాబాద్ ఎంపీగా ఉన్న అసద్దుద్దీన్‌ ఓవైసీ కూడా మద్దతు ఇచ్చారు.

ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎవరితో పొత్తులో లేమని స్పష్టం చేసింది బీఆర్‌ఎస్‌. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది . ఇప్పటికే బీజేపీకి బీ టీమ్ గా మారారని విమర్శలు వచ్చాయి. దీంతో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా.. వేరుగా అవిశ్వాస తీర్మానం ఇచ్చింది బీఆర్ఎస్‌.


ఏపీలో ఉన్న వైసీపీ,టీడీపీ కూడా ఎవరీకి మద్దతు ప్రకటించలేదు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. అయితే అవిశ్వాస తీర్మానం విషయంలో తటస్థంగా ఉంది వైసీపీ.కాని పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చేలా కామెంట్ చేసింది వైసీపీ. సభను స్తంభింపజేయడం సరికాదంటూ ట్వీట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

ఇక టీడీపీకి లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వీరు కూడా ఏ కూటమికి మద్దతు ఇవ్వలేదు. ఏపీలో ఇప్పటికే ఎన్డీయేలో టీడీపీలో చేరతుందని ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో జనసేన,టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా.. బీజేపీకి ఎలాంటి మద్దతు ప్రకటించలేదు టీడీపీ.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×