E-Paper

RV Karnan: జీహెచ్ఎంసీలో పెద్దన్న మౌనం.. అసలు కారణం అదేనా..?

RV Karnan: జీహెచ్ఎంసీలో పెద్దన్న మౌనం.. అసలు కారణం అదేనా..?

RV Karnan: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రజలకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో విభిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు శ్రీజన, వినయ్ కృష్ణారెడ్డి లు ప్రతి రోజు ఒక్కో ప్రాంతాన్ని, ఒక్కో వార్డును ఎంపిక చేసుకుని మార్నింగ్ వాక్ లో భాగంగా పర్యటనలు నిర్వహిస్తూ పౌర సేవల నిర్వహణ తీరు, అభివృద్ది పనుల పురోగతి వంటి విషయాలతో పాటు స్థానికులను కలిసి సమస్యలను కూడా అడిగి తెల్సుకుని, వాటి పరిష్కారం కోసం స్పాట్ లోని అధికారులకు ఆదేశాలు, సూచనలు, సలహాలను జారీ చేస్తున్నారు. అంతేగాక, డైలీ విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అధికారులు సిబ్బందికి తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ జీహెచ్ఎంసీలో మాత్రం ఇలాంటి పరిస్థితులేమీ కన్పించటం లేదు.

గత సంవత్సరం..

గడిచిన కొద్ది రోజులుగా కమిషనర్ యాక్టీవ్ గా లేకపోవటంతో ఒక రకమైన స్తబ్దత నెలకొంది. మూడు కార్పొరేషన్లలో అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్, మూడు కార్పొరేషన్లలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన జీహెచ్ఎంసీలో మాత్రం ఎలాంటి హడావుడి, పర్యటనలు, సమీక్షలు అంటూ ఏమీ లేకుండా స్తబ్దత నెలకొంది. కానీ గత సంవత్సరం చివరి త్రైమాసికంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్.వి.కర్ణన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఎంతో యాక్టీవ్ గా మార్నింగ్ వాక్‌లు, అభివృద్ది పనుల పరిశీలనలు నిర్వహిస్తూ విభాగాల వారీగా సమీక్షలు కూడా నిర్వహిస్తూ బిజీగా ఉండే వారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన సర్కారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆయన విలీనం, వార్డుల పునర్విభజన వంటి ప్రక్రియలను ఎంతో వ్యూహాత్మకంగా పూర్తి చేస్తూ, ఒక్కో రాత్రి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా విధులు నిర్వర్తించే వారు.

కమిషనర్ మౌనం..

పట్టణ స్థానిక సంస్థల విలీనం తర్వాత డిసెంబర్ 10వ తేదీ తర్వాత జీహెచ్ఎంసీ పరిధి ఏకంగా 2 వేల 58 చదరపు కిలోమీటర్లకు విస్తరించటం, పన్నెండు జోన్లు, 60 సర్కిళ్లుగా దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా కొనసాగినపుడు కూడా కమిషనర్ కర్ణన్ తనదైన మార్కు పాలనను కొనసాగించారు. సామాన్య సందర్శకులకు కూడా రోజు సమయమిచ్చే కమిషనర్ జీహెచ్ఎంసీ ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి, వారి నుంచి ప్రతి శనివారం ఫిర్యాదులు స్వీకరిస్తూ వచ్చారు. కానీ గడిచిన కొంతకాలం కమిషనర్ మౌనం, కార్పొరేషన్లలో నెలకొన్న స్తబ్దతపై అనేక రకాలుగా చర్చ జరుగుతుంది.

Also Read: PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

ఎంతో వ్యూహాత్మకంగా మున్సిపల్ వార్డుల పునర్విభజన

దేశంలో అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా జీహెచ్ఎంసీ కొనసాగుతున్న సమయంలో అదనంగా వచ్చిన ఇద్దరు అదనపు కమిషనర్లతో ఆయన మొత్తం కార్పొరేషన్ పరిపాలన కొనసాగించారు. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థల విలీనం పూర్తయిన తర్వాత పెరిగిన విస్తీర్ణాన్ని ఎలాంటి అడ్డంకులు గానీ, అభ్యంతరాలు గానీ రాకుండా వార్డుల పునర్విభజన చేయటంలో కర్ణన్ తమ మార్కు వ్యూహాన్ని అమలు చేశారని చెప్పవచ్చు. కేబీఆర్ పార్కు చుట్టూ సుమారు రూ.1090 కోట్ల వ్యయంతో హెచ్ సిటీ ప్రాజెక్టు కింద నిర్మించనున్న ఏడు అండర్ పాస్ లు, ఏడు స్టీల్ ఫ్లై ఓవర్ల పనులకు చేపట్టిన స్థల సేకరణకు అడ్డంకులు ఎదురుకావటంతో కమిషనర్ కర్ణన్ నేరుగా స్థల యజమానుల ఇంటికెళ్లి వారితో చర్చించి, వారిని ఒప్పించారు. అంతేగాక, హెచ్ సిటీ పనులపై ప్రతి మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షలు నిర్వహించి ఎట్టకేలకు కేబీఆర్ చుట్టూ పనులు మొదలు పెట్టారు.

ప్రస్తుతం హాట్ టాపిక్..

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజాపాలన, అభివృద్ది ప్రణాళిక 99 రోజులు కార్యచరణలో ఎంఎంసీ, సీఎంసీల్లో వివిధ అంశాలకు సంబంధించి చివరి రోజైన ఈ నెల 11వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలను జరిగాయి. వాటిల్లో కమిషనర్లు శ్రీజన, వినయ్ కృష్ణా రెడ్డి కూడా పాల్గొన్నారు. కానీ ఈ కార్యచరణ మొదలైన జూన్ 2వ తేదీ తర్వాత ఒకటి రెండు కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొన్న కమిషనర్ ఆ తర్వాత ఎక్కడా కూడా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. సెన్సెస్ ప్రక్రియలో భాగంగా తొలుత చేపట్టిన హౌజ్ లిస్టింగ్ ప్రక్రియను కూడా ఇటీవలే తుక్కుగూడలో క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు. అంతలోనే ఏం జరిగింది? జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఎందుకు మౌనం వహిస్తున్నారన్నది జీహెచ్ఎంసీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే ఆయన మూడు రోజుల్లో సెలవుల్లో వెళ్లటంతో అధికారులు కూడా ఆయా రాం గయారాం తరహాలో విధులు నిర్వహించారు.

Also Read: HYDRAA: హైదరాబాద్‌కు కొత్తగా మెట్ ఎమర్జెన్సీ టీమ్స్.. రంగంలోకి 51 బృందాలు..!

వర్షాకాలం ఏర్పాట్లపై సమీక్ష లేదు

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మహానగరంలో కేవలం గంట వ్యవధిలోనే పది సెంటీమీటర్ల వర్షం కురిసి, నగరం మొత్తం అతలాకుతలమైన సంగతి తెల్సిందే. 76 చోట్ల చెట్లు విరిగిపడి, పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో కరెంటు షాక్ కు గురై ఇద్దరు మృతి చెందినా ఘటన జరిగిన రోజు గానీ, మరుసటి రోజు గానీ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పర్యటించిన దాఖలాల్లేవు. గత సంవత్సరం వినాయక నిమజ్జనోత్సవం కార్యక్రమంలో బషీర్ బాగ్ వద్ద వేగంగా వెళ్తున్న టస్కర్ వాహానం కింద ప్రమాదవశాత్తు జీహెచ్ఎంసీ మహిళా కార్మికురాలు పడి మృతి చెందిన సమాచారం తెలియగానే కమిషనర్ కర్ణన్ హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు.

స్పందన కరువు..

అప్పటికే హాస్పిటల్ కు తరలించిన సదరు మహిళా కార్మికురాలు మృతి చెందిన విషయాన్ని వైద్యులు నిర్థారించిన తర్వాత కార్మికురాలి కుటుంబానికి రూ. 2 లక్షలు, ఆ తర్వాత మరో రూ. 6 లక్షల నష్టపరిహారాన్ని కూడా ఇప్పటించిన కమిషనర్ పాతబస్తీలో ఇద్దరు కరెంటు షాక్ తో మృతి చెందిన కనీసం స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది. పైగా సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లతో పాటు హైడ్రా, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు వర్షాకాల ఏర్పాట్లపై వేర్వేరుగా, సమష్టిగా పలు సార్లు వర్షకాల సన్నధ్ద సమావేశాలు నిర్వహించినా, జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు కమిషనర్ వర్షాకాల ఏర్పాట్లను సమీక్షించిన దాఖలాల్లేవు.

Also read: Hyundai New SUVs: టాటా, మారుతికి హ్యుందాయ్ షాక్.. ఒకేసారి మూడు SUVల ఎంట్రీ!

Related News

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. మంత్రి తుమ్మల, ఎంపీ అనిల్ స్టేట్‌మెంట్స్ రికార్డ్

TGSRTC Merger: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ విలీనం తర్వాతే వేతన సవరణపై నిర్ణయం!

Jagadish Reddy: హ్యామ్ రోడ్ల పేరిట రేవంత్ సర్కార్ పెద్ద స్కామ్.. సీఎంపై జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు!

Merugu Madhu: సినిమా ప్రభావంతో యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు: మెరుగు మధు

ఖమ్మం బాలిక ఘటనపై కవిత ఫైర్.. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్

Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖకు.. మరో అంతర్జాతీయ స్థాయి ఘనత..!

కాంగ్రెస్ ఫస్ట్ పార్ట్ అట్టర్ ప్లాప్.. సెకండ్ పార్ట్‌పై నమ్మకమే లేదు.. కేటీఆర్ తీవ్ర విమర్శలు

×