Big Stories

Obesity : వాయుకాలుష్యంతో మహిళలకు ఊబకాయం వస్తుందా?

Obesity : ప్రస్తుత కాలంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. గాలి, నీరు, ఆహారం.. ఇలా అన్నీ కలుషితమవుతున్నాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మహిళల్లో ఊబకాయానికి గాలి కాలుష్యం కూడా కారణమని అనేక పరిశోధనల్లో తేలింది. డయాబెటీస్ కేర్ జర్నల్‌ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం వాయు కాలుష్యానికి గురయ్యే మధ్య వయసు మహిళల్లో అధిక కొవ్వు శాతం, తక్కువ లీన్ మాస్‌ ఉంటుందని తేలింది. వాయు కాలుష్యంతో శరీరంలో కొవ్వు 4.5 శాతం, 2.6 పౌండ్ల వరకు పెరుగుతుందంటున్నారు.

- Advertisement -

మధ్య వయసు మహిళల బాడీ మాస్ ఇండెక్స్, నడుము పరిమాణం, శరీర కొవ్వుల మధ్య కూడా సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా 40-50 ఏళ్ల వయసు మహిళల్లో దీర్ఘకాలం వాయు కాలుష్య ప్రభావం ఉంటుందని తేలింది. అంతేకాకుండా ఎక్కువ స్థాయి సూక్ష్మ కణాలు, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ ఎ పెరుగుదల ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 1,654 మంది మహిళలపై అధ్యయనం నిర్వహించారు. 50 ఏళ్ల వయసున్న మహిళలను 2000 సంవత్సరం నుంచి 2008 వరకు పర్యవేక్షించారు. వీరి శరీరంపై వాయు కాలుష్యం, శారీరక శ్రమ మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు.

- Advertisement -

మహిళల్లో ఊబకాయాన్ని నివారించేందుకు తీసుకున్న ఆహారానికి సరిపడా వ్యాయామం చేయాలని చెబుతున్నారు. వేపుళ్లు, తీపి పదార్థాలను దూరం పెట్టాలంటున్నారు. జంక్‌ఫుడ్‌, ఐస్‌క్రీమ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ తీసుకోవడం మానేయాలి. అధికంగా కూరగాయలు, నట్స్‌, పండ్లు ఉండేలా చూడాలి. వాయు కాలుష్యానికి గురికాకుండా బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌ ధరించాలి. యూవీ రేస్‌ బారినపడకుండా గాగుల్స్‌ ధరించాలని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News