BigTV English

AR Rahman: విడాకుల వల్ల ఏఆర్ రెహమాన్ కెరీర్‌కు బ్రేక్.. క్లారిటీ ఇచ్చిన కూతురు

AR Rahman: విడాకుల వల్ల ఏఆర్ రెహమాన్ కెరీర్‌కు బ్రేక్.. క్లారిటీ ఇచ్చిన కూతురు

AR Rahman: గత కొన్నేళ్లలో సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీల సంఖ్య ఎలా పెరుగుతుందో.. విడాకులు తీసుకునేవారి సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది. ఇటీవల సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకున్నాడని ప్రకటించగానే ఒక్కసారిగా సినీ సెలబ్రిటీలతో పాటు ప్రేక్షకులు కూడా షాకయ్యారు. 29 ఏళ్ల పాటు హ్యాపీగా కలిసున్న ఈ జంట విడిపోవడమేంటి అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక విడాకుల గురించి బయటికి రాగానే వీరిపై అనేక రూమర్స్ కూడా వినిపించాయి. తాజాగా విడాకుల ఎఫెక్ట్ వల్ల ఏఆర్ రెహమాన్ సంవత్సరం పాటు మ్యూజిక్ నుండి బ్రేక్ తీసుకోనున్నాడని రూమర్స్ వినిపిస్తుండగా వాటిపై తన కూతురు క్లారిటీ ఇచ్చింది.


ఎన్నో రూమర్స్

29 ఏళ్ల పాటు మ్యారేజ్ లైఫ్‌లో సంతోషంగా ఉన్న ఏఆర్ రెహమాన్, సైరా బాను (Saira Banu) ఎందుకు విడిపోతున్నామని చెప్పకుండా విడాకులను ప్రకటించారు. దీంతో వీరి విడాకులకు కారణం ఇదేనంటూ ఎన్నో రూమర్స్ వినిపించాయి. ప్రేక్షకులంతా రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఆఖరికి ఏఆర్ రెహమాన్‌కు వివాహేతర సంబంధం ఉందని కూడా అనుకున్నారు. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే మోహిని డేతో రెహమాన్ రెండో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. దానిపై రెహమాన్ తరపున లాయర్ సీరియస్‌గా స్పందించాడు. తన భార్య కూడా ఇవన్నీ నిజాలు కాదని కొట్టిపారేసింది. తాజాగా తనపై మరో రూమర్ రావడంతో ఈసారి దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి తన కూతురు రంగంలోకి దిగింది.


Also Read: స్టార్ సింగర్‌కు కన్నడ నేర్పిన దీపికా పదుకొనె.. స్టేజ్‌పైనే అతడితో కలిసి రచ్చ

ఆపండి ప్లీజ్

‘ఏఆర్ రెహమాన్ (AR Rahman) మ్యూజిక్ నుండి 1 ఏడాది పాటు బ్రేక్ తీసుకోబోతున్నారు. ఆయన మ్యూజిక్‌ను మిస్ అవుతాం’ అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘ఇలాంటి అనవసరమైన రూమర్స్ వైరల్ చేయడం ఆపండి ప్లీజ్’ అంటూ క్లారిటీ ఇచ్చింది ఏఆర్ రెహమాన్ కూతురు ఖతిజా రెహమాన్. ఇప్పటికే ట్విటర్‌లో ఇలాంటి వార్త వచ్చి చాలాకాలం అవుతోంది. విడాకుల వల్ల రెహమాన్ కృంగిపోయాడని, అందుకే మ్యూజిక్ నుండి బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాడని నెటిజన్లు ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో అవన్నీ చూస్తూ ఉన్న ఖతిజా.. ఫైనల్‌గా రియాక్ట్ అవ్వక తప్పడం లేదు. ఇప్పటివరకు ఈ విషయంపై రెహమాన్ నేరుగా స్పందించలేదు.

అందుకే విడాకులు

విడాకుల విషయంపై ఏఆర్ రెహమాన్ నేరుగా స్పందించలేదు. తాను విడాకులు తీసుకుంటున్నట్టుగా ట్వీట్ చేసిన తర్వాత ఆయన నుండి మళ్లీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. రెహమాన్‌పై అనవసరమైన రూమర్స్ వ్యాపించేలా చేస్తే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తరపున లాయరే అందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఇక తన ఆరోగ్యం బాగుండడం లేదని, అందుకే ఎవరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని రెహమాన్ భార్య సైరా బాను స్వయంగా తెలిపారు. కానీ ఆమె చెప్పిన విషయాన్ని చాలామంది ప్రేక్షకులు నమ్మడానికి సిద్ధంగా లేరు. నవంబర్ 19న వీరిద్దరూ విడాకుల గురించి ప్రకటించారు.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×