BigTV English

Independence Day: ఆగస్టు 15న మొత్తం ఎన్ని దేశాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోనున్నాయంటే..?

Independence Day: ఆగస్టు 15న మొత్తం ఎన్ని దేశాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోనున్నాయంటే..?

Independence Day: బ్రిటీషుల పాలనలో దాదాపుగా 200 ఏళ్లపాటు మగ్గిపోయిన భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సాధించింది. స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వారి ఆశలు, ఆశయాలు నెరవేరేలా భారత్ ఆగస్టు 15న స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నది. అప్పటి నుంచి ఆగస్టు 15న ఇండియా వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను నిర్వహిస్తున్నారు. రేపు అనగా ఆగస్టు 15. కావున రేపు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయాన్నే మువ్వన్నెల జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తారు. స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యం, సాధించిన తీరు, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేస్తూ ఒకరికొకరు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.


భారత్ తోపాటు మరికొన్ని దేశాలు కూడా రేపు ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోనున్నాయి. మొత్తం ఐదు దేశాలు ఇండియాతోపాటు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటాయి. అవేమిటంటే.. బహ్రెయిన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, లీచ్‌టెన్‌స్టెయిన్, ఆఫ్రికా దేశమైన కాంగో.. ఈ ఐదు దేశాలు కూడా తమ జాతీయ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకోనున్నాయి.

Also Read: మీకు తెలుసా? మీ రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేసే బదులు మరొక్కరికి ట్రాన్సఫర్ చేయొచ్చు.. ఇదిగో ఇలా!


బహ్రెయిన్…
ఇండియా మాదిరిగా బహ్రెయిన్ కూడా బ్రిటీష్ పాలనలో మగ్గిపోయింది. 1971లో ఈ దేశం బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందింది. 1971 ఆగస్టు 14న వారికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ కూడా వారు ఆగస్టు 15ననే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు.

లీచ్‌టెన్‌స్టెయిన్…
లీచ్‌టెన్‌స్టెయిన్ దేశం ప్రపంచంలోనే ఆరవ అతి చిన్న దేశం. 1866 ఆగస్టు 15న ఈ జర్మనీ నుంచి ఈ దేశం స్వాతంత్ర్యం పొందింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇక్కడ ప్రతిసారి ఆగస్టు 15న ఘనంగా ఇండిపెండెన్స్ డేను జరుపుకుంటారు.

కాంగో..
ఆఫ్రికా దేశమైనటువంటి కాంగో కూడా ఆగస్టు 15న ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటది. 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుండి ఈ దేశం స్వాతంత్ర్యం పొందింది. అప్పటి నుంచి స్వాతంత్ర్య వేడుకలను ఈ దేశంలో నిర్వహిస్తారు.

Also Read: దేశంలోకి తీవ్రవాదుల చొరబాటు.. ఢిల్లీలో హై అలర్ట్

ఉత్తర కొరియా..
1945లో కొరియన్ ప్రజలు స్వతంత్రులయ్యారు. జపాన్ యొక్క 35 ఏళ్ల వలస పాలన నుంచి వీరికి స్వాతంత్ర్యం లభించింది. అందుకే ఈరోజున కొరియా జాతీయ విముక్తి దినం అంటారు. 1945 ఆగస్టు 15న ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఈ రెండు దేశాలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు.

దక్షిణ కొరియా..
35 సంవత్సరాల పాటు జపాన్ వలస పాలన నుంచి దక్షిణ కొరియాకు కూడా 1945, ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి దక్షిణ కొరియా ప్రజలు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×