BigTV English

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పంద్రాగస్టు షెడ్యూల్ ఇదే

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పంద్రాగస్టు షెడ్యూల్ ఇదే

CM Schedule: రేపు దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మునిగిపోనుంది. ఈ వేడుకలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ షెడ్యూల్(CM Revanth Reddy Schedule) ప్రకారం, రేపు ఉదయం 8.30 గంటలకు గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా (National Flag)ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 9.20 గంటలకు పరేడ్ గ్రౌండ్ చేరుకుని సైనికుల స్మారకానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం, ఆయన గోల్కొండ కోటకు పయనమవుతారు.


ఉదయం 10 గంటలకు ఆయన గోల్కొండ కోట (Golconda Fort)కు చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. స్వాతంత్ర్య వేడుక సంబురాల్లో పాల్గొంటారు. పలువురికి సేవా, పురస్కార పథకాలను అందిస్తారు. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జి్లలాకు వెళ్లనున్నారు.

ఉదయం 11.45 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లా ముల్కపల్లి మండలం పూసుగూడెం గ్రామానికి హెలికాప్టర్ పై ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. 12.50 గంటలకల్లా ఆ హెలికాప్టర్ పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్టు పంప్ సెట్ 2కు చేరుకుంది. 12.55 గంటల నుంచి 1.45 గంటల వరకు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌజ్ 2కు చేరుకుని అక్కడ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. పంప్ హౌజ్ 2ను ఆయన స్విచ్ నొక్కి ప్రారంభిస్తారు. పూజా కార్యక్రమం జరుగుతుంది.


Also Read: New Bowling Coach: టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.. గంభీర్ రికమెండ్‌తోనే ?

మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన పంప్ హౌజ్ 2 నుంచి ఖమ్మం జిల్లా వైరాకు బయల్దేరుతారు. 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రైతులకు రూ. 2 లక్షల వరకున్న రుణాల మాఫీ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత వైరా పట్టణంలోనే బహిరంగ సభలో మాట్లాడుతారు. 4.45 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి రాజ్ భవన్‌కు వెళ్లుతారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×