BigTV English

Mukesh Ambani : అంబానీ మరో అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు!

Mukesh Ambani : ముఖేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏ రంగంలో దూసుకెళ్తొంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అనూహ్యమైన అడుగులతో ప్రత్యర్థి కంపెనీలకు చెక్‌ పెడుతుంది. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే రిలయన్స్‌ జియో అగ్రగామిగా ఎదిగింది. ఇప్పుడు అదే జియో ఓటీటీ రంగంలోనూ సైతం టాప్‌ కంపెనీగా ఎదిగేందుకు వేగంగా పావులు కదుపుతోంది.

Mukesh Ambani : అంబానీ మరో అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు!

Mukesh Ambani : ముఖేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏ రంగంలోనైనా దూసుకెళ్తోంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అనూహ్యమైన విధానాలతో ప్రత్యర్థి కంపెనీలకు చెక్‌ పెడుతుంది. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే రిలయన్స్‌ జియో అగ్రగామిగా ఎదిగింది. ఇప్పుడు అదే జియో ఓటీటీ రంగంలోనూ టాప్‌ కంపెనీగా ఎదిగేందుకు వేగంగా పావులు కదుపుతోంది.


ప్రస్తుతం ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో.. వాల్ట్ డిస్నీని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఈ ఒప్పంద ప్రక్రియ వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తవుతున్నట్లుగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో డిస్నీ హాట్‌స్టార్ మీడియా కార్యకలాపాలు రిలయన్స్‌కు దక్కుతాయి.

జియోకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ .. డిస్నీ ప్లస్ , జియో సినిమా, హాట్‌స్టార్ నుంచి ప్రత్యక్ష పోటీని ఎదుర్కొంటోంది. మొదట జియో సినిమా.. డిస్నీ హాట్‌స్టార్ ఐపీఎల్‌ హక్కులను దక్కించుకుంది. ఆ తర్వాత డిస్నీ హాట్‌స్టార్ జియో సినిమా నుంచి మొదలుకొన ఆసియా కప్, క్రికెట్ ప్రపంచ కప్ హక్కులను సైతం చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు జియో ఏకంగా డిస్నీ హాట్‌స్టార్‌నే కొనుగోలు చేయాలని చూస్తోంది. అయితే జియో సినిమాతో పోటీలో ఈ కంపెనీ గణనీయమైన నష్టాలను చవిచూడటం గమనార్హం. ఫిఫా, ఐపీఎల్‌, ప్రపంచ కప్ తర్వాత హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.


ఈ ఒప్పందం తర్వాత, జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో విలీనం కానున్నాయి. ఇప్పటికే ఉన్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కస్టమర్‌లు జియో సినిమాకు మారనున్నాయి. ఈ పరిణామాలు ప్రముఖ అమెజాన్ ప్రైమ్‌,ఓటీటీలైన నెట్‌ఫ్లిక్స్ లను ఆందోళన కలిగిస్తున్నాయి . జియో సినిమా సరసమైన ప్లాన్‌లను అందించవచ్చు, అంటే ఒకే దెబ్బకు ముడు పిట్టలు అన్నమాట!

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×