BigTV English

 Leo Collections : బాక్సాఫీస్ షేక్.. రికార్డు లెవెల్ లో లియో మొద‌టి రోజు కలెక్ష‌న్స్..

 Leo Collections : బాక్సాఫీస్  షేక్.. రికార్డు లెవెల్ లో లియో మొద‌టి రోజు కలెక్ష‌న్స్..
Leo Collections

Leo Collections : కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన లియో చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 19న 12 వేల స్క్రీన్లపై గ్రాండ్ గా విడుదల అయింది. డైరెక్ట్ తెలుగు చిత్రాలు చేయకపోయినా డబ్బింగ్ చిత్రాల ద్వారా టాలీవుడ్ కి విజయ్ బాగా సుపరిచితుడు. రీసెంట్ గా వచ్చిన వారసుడు చిత్రంతో అతను తెలుగు ఇండస్ట్రీకి మరింత దగ్గర అయ్యాడు. దీంతో ఈసారి తెలుగు మార్కెట్ పై కూడా తన హవా చూపించాలి అని విజయ్ ఈ మూవీ తో ఎంతో గట్టిగా ప్రయత్నించాడు. అందుకే లియోకి తెలుగులో కూడా ప్రమోషన్స్ భారీగా చేశారు.


ఇక దసరా సందర్భంగా లియోతో పాటు బాలయ్య భగవత్ కేసరి కూడా విడుదలైంది. బాలయ్య మూవీతో లియో పోటీ అంటే మామూలు విషయం కాదు. నందమూరి నటసింహంతో.. లియో గట్టిగానే పోటీ పడింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి డే కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసింది. ఇప్పటికే ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీకి 17 కోట్ల షేర్ కలెక్షన్స్ను బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఫిక్స్ చేశారు. విజయ్ మార్కెట్ ఎక్కువగా నడిచే తమిళనాడులో మాత్రం లియో కి రూ.100 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక మిగిలిన సినీ మార్కెట్ లలో విజయ్ హవా ఎలా ఉందో చూస్తే.. మొత్తానికి కర్ణాటకలో రూ. 15.50 కోట్లు ,కేరళలో రూ. 13.50 కోట్లు ,ఓవర్సీస్‌లో రూ.60 కోట్లు, మిగిలిన అన్ని ప్రాంతాలలో రూ.10 కోట్లు అంటే టోటల్ గా రూ. 215 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

సినిమా విడుదలైన తర్వాత.. అంచనాలకు తగ్గట్టుగానే ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసిందా లేదా చూద్దాం. మొత్తానికి వరల్డ్ వైడ్ గా 2800 పైగా థియేటర్లలో లియో నిన్న విడుదల అయింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపు 500 థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం మొత్తం బడ్జెట్ కలిపి రూ.300 కోట్లు. అయితే తొలిరోజే సుమారు సగం బడ్జెట్ అంటే రూ.140 కోట్ల వరకు బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి లియో సినిమా తొలి రోజు బుకింగ్స్ రూ.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాయి.


ఇక తొలిరోజు.. తమిళనాడులో రూ.32 కోట్లు, కేరళలో రూ.12.50 కోట్లు, కర్ణాటకలో రూ.14.50 కోట్లు, ఇక మిగిలినవన్నీ కలిపి.. మొత్తం రూ.80 కోట్ల వరకు లియో కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే సుమారు రూ.65 కోట్ల వరకు ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ కాగా వరల్డ్ వైడ్ మొత్తం కలుపుకొని రూ.140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇదే జోరు నాలుగైదు రోజులు కంటిన్యూ అయితే సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవడమే కాకుండ మాంచి కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయం. అయితే లియో కి తొలిరోజు బాలయ్య చిత్రం ఒకటే కాంపిటీషన్.. కానీ ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ..టైగర్ నాగేశ్వరరావుగా బరిలోకి దిగాడు. ఒక పక్క లియో, ఇంకోపక్క కేసరి, మరోపక్క టైగర్.. మరి ఈ ముగ్గురు స్టార్ హీరోల్లో.. ఎవరు ఎవరి రికార్డులు బద్దలు కొడతారో.. వేచి చూడాలి.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×