Indian Railway: భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. భారత్ పాక్ లోని ఉగ్రస్ధావరాలను ధ్వంసం చేస్తే, పాకిస్తాన్ మాత్రం భారత పౌరులు, ఆధ్యాత్మిక ప్రాంతాలే టార్గెట్ గా దాడులకు తెగబడుతోంది. పాకిస్తాన్ నుంచి వచ్చే దాడులను భారత రాడార్ వ్యవస్థ సమసర్థవంతంగా ధ్వంసం చేస్తోంది. పాక్ మిసైల్స్ తో పాటు ఫైటర్ జెట్లను కూడా కూల్చివేస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
జమ్మూకాశ్మీర్ నుంచి ప్రత్యేక రైళ్లు
‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణీకులను తరలించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. జమ్మూ, ఉదంపూర్ నుంచి మూడు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. భద్రతా సమస్యలు పెరిగిన నేపథ్యంలో ప్రయాణీకుల డిమాండ్ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
⦿ 04312 నెంబర్ గల ప్రత్యేక రైలు ఉదయం 10. 45 నిమిషాలకు జమ్మూ నుంచి ఢిల్లీకి బయల్దేరింది. ఈ రైలులో మొత్తం 24 కోచ్ లు ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వాటిలో 12 అన్ రిజర్వ్‌డ్ కాగా, 12 రిజర్వ్‌డ్ కోచ్‌లు.
⦿ ఒక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు 12.45 గంటలకు ఉదంపూర్ నుంచి బయల్దేరింది. ఈ రైలు జమ్మూ, పఠాన్ కోఠ్ మీదుగా ఢిల్లీకి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఇందులో 20 కోచ్ లు ఉంటాయి.
⦿ పూర్తిగా రిజర్వ్ చేసిన మరో ప్రత్యేక రైలు సాయంత్రం 7 గంటలకు జమ్మూ నుంచి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో 22 కోచ్ లు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జమ్మూ, ఉదంపూర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లను నడపాలని భారత రైల్వే నిర్ణయించిందని అధికారులు వెల్లడించారు.
Special Trains | Jammu–Martyr Captain Tushar Mahajan
-04612 departed from Jammu at 10:45 | 12 Unreserved + 12 reserved coaches
-20 coach Vande Bharat spcl at 12:45 ex Martyr Captain Tushar Mahajan via Jammu & Pathankot
-22 coach fully reserved LHB spcl ex Jammu around 19:00 hrs— Ministry of Railways (@RailMinIndia) May 9, 2025
Read Also: బాయ్ కాట్ టర్కిష్ ఎయిర్ లైన్స్, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్!
కాశ్మీర్ లో రైల్వే ఆస్తుల రక్షణ కోసం భారతీ భద్రత
దేశ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రైల్వే లైన్లపై భద్రతా అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రైల్వే లైన్లు టార్గెట్ గా దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉదంపూర్, శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ సహా అంజి ఖాడ్ రైల్వే బ్రిడ్జి, చీనాబ్ రైల్వే బ్రిడ్జి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటు దేశంలోని పలు రైల్వేస్టేషన్లలో పోలీసులు డాగ్‌స్క్వాడ్స్, జీఆర్‌పీ బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్లాట్ ఫారమ్, స్టేషన్ పరిసరాల్లో తనిఖీలు చేస్తున్నారు. రైల్వే ప్రయాణీకును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
Read Also: భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, విమానయాన సంస్థల కీలక నిర్ణయం!