India Vs Pakistan War : గురువారం రాత్రంతా బ్రేకింగ్ న్యూస్. ఇండియాపై పాకిస్తాన్ అటాక్. 4 రాష్ట్రాల్లోని 36 ప్రాంతాలపై డ్రోన్లతో దాడి చేసింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 400 వరకు డ్రోన్లను భారత్ లక్ష్యాలపై ప్రయోగించిందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. మూడున్నర గంటల పాటు నాన్‌స్టాప్ ఫైరింగ్ చేసింది. వందల సంఖ్యలో క్షిపణులు, సూసైడ్ డ్రోన్లు, ఫైటర్‌జెట్లతో మన దేశంపైకి యుద్ధానికి దిగింది. వాటన్నిటినీ కూల్చేశామని ఆపరేషన్ సిందూర్ అప్‌డేట్స్‌ను మీడియాకు వివరించారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు. ఈ సందర్భంగా పాక్ దాడి వెనుక ఉన్న కుట్రను కూడా వెల్లడించింది MEA.
పాక్ అందుకే అటాక్
భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను టెస్ట్ చేసేందుకే పాకిస్తాన్ ఇలా వందలాది డ్రోన్లను ఇండియా మీదకు వదిలిందని MEA తెలిపింది. మన గగనతల రక్షణ వ్యవస్థ ఎక్కడెక్కడ మోహరించి ఉంది? ఎలా పని చేస్తుంది? దాని సామర్థ్యం ఎంత? ఇలా నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా పాక్ డ్రోన్ అటాక్ చేసిందని వెల్లడించింది. అవన్నీ టర్కీ తయారీ డ్రోన్లుగా గుర్తించారు. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లో దాడులకు ప్రయత్నించగా.. అన్నిటినీ నేలమట్టం చేశామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేస్తోందని ఆరోపించారు. గురుద్వారాలపై అటాక్ చేసి దేశంలో హిందూ, సిక్కు మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా పాక్ చేస్తున్న కుట్రను బయటపెట్టారు.
పాక్ కుట్ర ఇదే..
ఇదే సమయంలో పాకిస్తాన్ మరో కుట్రకు కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మన దేశంపై దాడి చేసిన సమయంలో.. కరాచీ, లాహోర్ మధ్య పౌర విమానాలను రొటీన్‌గానే నడిపింది. ఇక్కడే పాక్ కుట్ర బయటపడింది. ఇండియా మీద దాడులకు తెగబడిన తర్వాత.. మన నుంచి రివేంజ్ అటాక్ జరుగుతుందని ఊహించింది. అలా జరగకుండా అడ్డుకునేందుకే.. కావాలనే కరాచీ, లాహోర్ రూట్‌లో ప్యాసింజర్ విమానాలను రన్ చేసిందని ఆర్మీ తెలిపింది. మనం రివర్స్ అటాక్ చేయకుండా.. ప్యాసింజర్ ఫ్లయిట్స్‌ను రక్షణ కవచంగా వాడుకున్నట్టు గుర్తించింది.
Also Read : ధోనీ, సచిన్.. యుద్ధ రంగంలోకి..
400 డ్రోన్లు vs S400..
గురువారం రాత్రి 8 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య పాకిస్తాన్ 400 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ డ్రోన్లను S400 డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. దేశీయంగా తయారు చేసిన ఆకాశ్ క్షిపణులతో భారత వైమానిక రక్షణ వ్యవస్థ శత్రుదేశ డ్రోన్లను నేల కూల్చింది. భయంకర పరిస్థితి నుంచి భారతీయులను S400 రక్షణ వ్యవస్థ రక్షించింది అని భారత ఆర్మీ ప్రకటించింది. భారత సైనిక, పౌర స్థావరాలు టార్గెట్‌గా చేసుకొని LoC వెంట నిరంతరాయంగా కాల్పులు జరుపుతోంది పాపిస్తాన్.