BIG TV LIVE Originals: ప్రతి మనిషికి తినేందుకు తిండి, కట్టుకునేందుకు బట్ట, ఉండేందుకు ఇల్లు ఉండాలి. ఈ మూడు ప్రతి ఒక్కరికి అత్యవసరం. ఎవరికి వాళ్లు తమ స్తోమతను బట్టి కట్టుకునే బట్టలు, నివాసం ఉండే ఇళ్లు కొనుగోలు చేస్తారు. కానీ, ధనవంతులు తమ నివాసం కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తారు. ఎక్కడా లేని సౌకర్యాల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. ఈ ఏడాది ఏప్రిల్ 2025 వరకు ప్రపంచంలోనే అత్యంత విలువైన బంగ్లాలు ఏవో చూద్దాం..
⦿ బకింగ్‌హామ్ ప్యాలెస్- ధర రూ. 40,915 కోట్లు
ఈ బంగళా లండన్ లోని వెస్ట్ మిన్ స్టర్ లో ఉంటుంది. ఈ బంగళా విలువ సుమారు 4.9 బిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ. 40,915 కోట్లు). బ్రిటిష్ చక్రవర్తి అధికారిక నివాసం అయిన బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది 8,28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. 52 రాయల్, గెస్ట్ బెడ్ రూమ్ లు, 188 స్టాఫ్ రూములు, 92 ఆఫీసులు, 78 బాత్రూమ్ లతో సహా 775 గదులను కలిగి ఉంది. బ్రిటిష్ రాచరికానికి చిహ్నంగా 40 ఎకరాల తోట ఉంటుంది. అయితే, ఈ ఆస్తిని అమ్మకూడదు.
⦿ ది హోమ్ – ధర రూ. 2,624 కోట్లు
ఈ భవంతి లండన్ లోని రీజెంట్ పార్క్ లో ఉంది. ఇది 205 ఏళ్ల పురాతన భవనం. వరుసగా మూడవ సంవత్సరం మార్కెట్లో ఉన్న అత్యంత ఖరీదైన ఇల్లుగా గుర్తింపు తెచ్చుకుంది. 29,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవంతి ఉంది. 40 బెడ్ రూమ్ లు, ఎనిమిది గ్యారేజీలు, టెన్నిస్ కోర్టు, సౌనా, లైబ్రరీ, గ్రాండ్ డైనింగ్ రూమ్‌ను కలిగి ఉంది. 1818 నుంచి ప్రముఖులు ఇందులో నివాసం ఉంటున్నారు.
Read Also: సమ్మర్ రద్దీ నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం, అందుబాటులోకి మరిన్ని ప్రత్యేక రైళ్లు!
⦿ అంటీలియా- ధర రూ.16,700 కోట్లు
ఈ భవంతి ముంబైలో ఉంది. దీని విలువ సుమారు రూ. 16,700 కోట్లు ఉంటుంది. ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ ఇంటిని నిర్మించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసంగా గుర్తింపు తెచ్చుకుంది. ముంబైలోని కుంబల్లా హిల్ లోని 27 అంతస్తులలో ఉంది. మొత్తం 400,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో మూడు హెలిప్యాడ్‌లు, 168 కార్ల గ్యారేజ్, 50 సీట్ల థియేటర్, స్నో రూమ్, 8.0 తీవ్రతతో కూడిన భూకంపాన్ని తట్టుకోగల డిజైన్ ను కలిగి ఉంది.
బకింగ్ హామ్ ప్యాలెస్ విలువ పరంగా జాబితాలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, అమ్మడం, కొనడం అనేది ఉండదు. ఇది బ్రిటిష్ చక్రవర్తుల అధికారిక నివాసంగా కొనసాగుతోంది. ఇక అమ్మకానికి ఉన్న ది హోమ్, $314 మిలియన్ల ధరను కలిగి ఉంది. బకింగ్ హామ్ ధర కంటే తక్కువగా ఉంది. ప్రైవేట్ గృహం అంటీలియా $2 బిలియన్ల విలువతో ముంబై రియల్ ఎస్టేట్ ధరలను ప్రతిబింబంగా నిలుస్తోంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: అక్కడ విమాన టికెట్ల ధరల కంటే రైలు టికెట్ల ధర ఎక్కువ.. విచిత్రంగా ఉందే!