Priyanka chopra: బాలీవుడ్ అందాల నటి ప్రియాంక చోప్రా చాలా కాలంగా హాలీవుడ్ లోనే నటిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతం హాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రపంచ సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను తీసుకున్న రాజమౌళి ఆమెకు మళ్లీ లైఫ్ ఇచ్చాడా అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి గల కారణాలు చూద్దాం..
వరుస ఆఫర్స్ ..
రాజమౌళి, ప్రియాంక చోప్రాను మహేష్ బాబు సినిమాలో తీసుకోవడంతో, ఎక్కడ చూసినా ఈ భామ జపమే జరుగుతోంది. ఈ సినిమాలో ప్రియాంకని రాజమౌళి తీసుకోకముందు ఈమె గురించి అనుకున్న వారే లేరు. ఒకసారి రాజమౌళి ప్రియాంక ను తీసుకుంటున్నట్లు తెలిసిన తరువాత ఇక అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రియాంక చోప్రా నాలుగేళ్లుగా ఇంగ్లీష్ వెబ్ సిరీస్, హాలీవుడ్ మూవీస్ ని మాత్రమే చేస్తుంది. రాజమౌళి ఈమెని ఈ సినిమాలో తీసుకోవడంతో అందరి నోటా ఈమె మాటే.. అంతే కాదు ఈ బ్యూటీ కి మరో పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. అల్లు అర్జున్ అట్లీ మూవీలో హీరోయిన్ గా ప్రియాంకని తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. హృతిక్ రోషన్ తో క్రిష్ 4లో ఈమె నటించే అవకాశం ఉందని సమాచారం. హృతిక్ రోషన్ క్రిష్, క్రిష్ 3లో ప్రియాంక చోప్రా తో నటించారు. ఇప్పుడు క్రిష్ 4లో ఈ భామనే హీరోయిన్ గా అనుకుంటున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా కు హాలీవుడ్ కమిట్మెంట్స్ ఉండడంతో రాజమౌళి ముందుగా ఈ అమ్మడి షూటింగ్ పార్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ముందుగా ప్రియాంక చోప్రా పాత్రను కంప్లీట్ చేసి ఆమె కమిట్మెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా జక్కన్న చేస్తున్నాడు. అందుకోసం ఒరిస్సాలోఓ ఫ్యాక్టరీలో జరిగే షూటింగ్ లో ప్రియాంక పాల్గొంది. తరువాత కెన్యాలో సెకండ్ షెడ్యూల్ ను ప్రియాంక చోప్రా తో షూట్ చేయనున్నారు. తాజాగా రాజమౌళి ఇందుకోసం డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేయించుకున్నారు. రాజమౌళి ప్రియాంక చోప్రా కు అవకాశం ఇవ్వడంతో ఈ భామ బిజీ అయిపోతుందని సినీ ప్రేమికులు భావిస్తున్నారు. ఏది ఏమైనా జక్కన్న పుణ్యమా అని ప్రియాంక ఫుల్ బిజీ అయిపోయింది. ఈ విషయం తెలిసిన అభిమానులు జక్కన్న ఫోటోకి దండేసి దండం పెట్టాలి అని ప్రియాంక ఈ పని ఎప్పుడు చేస్తుందో చూడాలి మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆమెకు ఇబ్బంది లేకుండా …
రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB29 మూవీ రానుంది. రాజమౌళి సినిమాలో నటించాలంటే చాలా కష్టం. RRR సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య జరిగే సన్నివేశం కోసం, ఎన్నోసార్లు టేక్ తీసుకున్నట్లు, అది కరెక్ట్ గా వచ్చేవరకు రాజమౌళి ఒప్పుకోలేదని, ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఆయనకి డేట్స్ ఇచ్చిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవడం అంటూ ఉండదు. సినిమా కోసం వారి జీవితాన్ని అంకితం చేయాల్సిందే, సినిమాపై అంత ప్రేమ ఉంటుంది కాబట్టే ఆయన తీసే, సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ ఖండాంతరాలు దాటి ఆస్కార్ దాకా చేరిందంటే అది జక్కన్న పుణ్యమే, మరి అలాంటి సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తుండడంతో, ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తాయనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల లో భారీ అంచనాలే ఉన్నాయి.సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇటు ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Priyanka Jain : ప్రియుడు శివ్ కంటే.. అతడంటేనే ఇష్టమంటున్న ప్రియాంక జైన్