Air India Plane Carsh Report: దేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటైన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానం కూలడానికి గల కారణాలు వెల్లడి అయ్యాయి. విమాన ఇంజిన్లకు సంబంధించి ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్ లు ఆగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చాయి. విమానం కూలడానికి ముందు కాక్ పిట్ లో జరిగిన వివరాలను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తమ నివేదికలో తెలిపింది.
విమానం ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే?
ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన సమయం నుంచి ప్రమాదంలో కూలిపోయే వరకు క్షణ క్షణం ఏం జరిగింది? అనే విషయాలను దర్యాప్తు అధికారులు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం జూన్ 12 ఉదయం 11:17 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చి అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగింది. మధ్యాహ్నం1:10 గంటలకు ఎయిర్ పోర్టులోని బే34 నుంచి బయల్దేరేందుకు రెడీ అయ్యింది. 1:25 గంటలకు ట్యాక్సీ క్లియరెన్స్ కోరింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంగీకరించింది. నిమిషం తర్వాత విమానం బే34 నుంచి 23వ రన్ వే మీదికి చేరింది. మధ్యాహ్నం 01:37 గంటలకు టేకాఫ్ అయ్యింది. మధ్యాహ్నం 01:38 గంటలుకు విమానం గాల్లోకి ఎగిరింది. 1:38:42 గంటలకు విమాన గరిష్ట వేగాన్ని అందుకుంది.
గాల్లోకి ఎగిరిన కాసేపటికే సమస్య
విమానం గరిష్ఠ వేగం అందుకున్న కొద్ది క్షణాల్లోనే రెండు ఇంజిన్లకు చెందిన ఫ్యూయెల్ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్ పొజిషన్ లోకి మారాయి. ఒక సెకను తర్వాత ఒకదాని తర్వాత మరొకటి ఆగిపోయాయి. ఇంజిన్లకు ఫ్యూయెల్ ఆగిపోవడంతో ఇంజిన్లు రెండూ పని చేయడం ఆగిపోయాయి. వేగం తగ్గుతూ వచ్చింది. స్విచ్‌లు ఎందుకు ఆఫ్ చేశారంటూ ఇద్దరు పైలెట్లు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లో వారి మాటలు రికార్డు అయ్యాయి. తాను చేయలేదంటే, తాను చేయలేదని చెప్పుకున్నారు. విమానం ఎయిర్ పోర్టు పెరీమీటర్ గోడను దాటిన వెంటనే విమానం పై నుంచి కిందికి పడుతూ వచ్చింది. ఈ విషయాలు ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అయ్యాయి.
చివరి నిమిషంలో జరిగింది ఇదే!
మధ్యాహ్నం 1:38:47 గంటలకు ఫస్ట్ ఇంజిన్ ప్యూయెల్ స్విచ్ కటాఫ్ నుంచి మళ్లీ రన్ కు మారింది. 1:38:56 గంటలకు రెండో ఇంజిన్ ఫ్యూయెల్ స్విచ్ కూడా కటాఫ్ నుంచి మళ్లీ రన్ కు మారింది. విమానంలో మొదటి ఇంజిన్ తిరిగి ఆన్ అయ్యింది. కానీ, రెండో ఇంజిన్ మాత్రం అనుకున్న వేగాన్ని వేగాన్ని అందుకోలేకపోయింది.1:39:05 గంటలకు విమానం ప్రమాదంలో ఉందని గ్రహించి పైలెట్ మేడే మేడే అంటూ ఏటీసీకి సమాచారం అందించారు. మధ్యాహ్నం 01:39:11 గంటలకు డేటా రికార్డింగ్ ఆగిపోయింది. విమానం కుప్పకూలి 242 మందిలో 241 మంది దుర్మరణం చెందారు.
Read Also: ఆమె మెట్రో రైలు ప్రమాదంలో చనిపోయింది.. కానీ, ఆమె ఫోన్ నుంచి కొడుకు, చెల్లికి కాల్స్.. అదెలా?