E-Paper
Advertisement

Dengue Preparedness: డేంజర్ జోన్‌లోకి తెలంగాణ.. ఈ సారీ ముందస్తు చర్యలు నిల్!

Dengue Preparedness: డేంజర్ జోన్‌లోకి తెలంగాణ.. ఈ సారీ ముందస్తు చర్యలు నిల్!
Advertisement

Dengue Preparedness: స్వేచ్చ బ్యూరో: సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం ఆసన్నమైనా.. వైద్యారోగ్యశాఖలో చలనం లేదు. ముఖ్యంగా కీలకమైన పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ మొద్దు నిద్రలో ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. వానాకాలం షురూ అయినా.. కనీసం యాక్షన్ ప్లాన్ ను కూడా తయారు చేయలేని సిచ్వేషన్ లో పబ్లిక్ హెల్త్ విభాగం ఉన్నది. పైగా ఈ ఏడాది సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ కేసులు తీవ్రస్థాయిలో నమోదయ్యే (ఔట్‌బ్రేక్) అవకాశం ఉందని పలు అంతర్జాతీయ, జాతీయ ఆరోగ్య సంస్థలు, సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వర్షాలు డెంగీ కారక ‘ఈడెస్’ దోమల వృద్ధికి అనుకూలంగా మారాయని స్పష్టం చేస్తున్నాయి.

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్..

సాధారణంగా ప్రతి 3-4 ఏళ్లకు ఒకసారి డెంగీ విజృంభణ తీవ్రంగా ఉంటోందని ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆ ప్రమాదకర ఔట్ బ్రేక్ పునరావృతమయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పలువురు పబ్లిక్ హెల్త్ స్పెషలిస్టులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. కానీ ఆ విభాగానికి హెచ్ వోడీగా ఉన్న పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని స్వయంగా ఆ శాఖ ఉద్యోగులే విమర్​శిస్తున్నారు. ప్రతీ ఏడాది రెయినీ సీజన్ ప్రారంభమయ్యే ముందే జిల్లా అధికారులతో రివ్యూలు, మీటింగ్ లు నిర్వహించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్తాయి. కానీ ప్రస్తుతానికి తమకు అలాంటి ఆదేశాలు ఏమీ రాలేదని, రెగ్యులర్ వర్క్ లో భాగంగానే ముందుకు సాగుతున్నామని ఓ డీఎమ్ హెచ్ వో తెలిపారు.

​ఏజెన్సీ ఏరియాల్లో ఆగమాగం..

Advertisement

​గిరిజన ప్రాంతాలు,ఏజెన్సీ పల్లెల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి ఏజెన్సీ జిల్లాల్లో ఇప్పటికే దోమల కాటుకు జనం అల్లాడిపోతున్నారు. ఆయా జిల్లాల్లోకొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టింగ్ కిట్లు, మెడిసిన్స్ వంటివేవీ పూర్తి స్థాయిలో లేవని మెడికల్ ఆఫీసర్లు చెప్తున్నారు.అంతేగాక గతంలో వర్షాకాలం రాకముందే ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించే మొబైల్ హెల్త్ టీమ్‌లు ఈసారి జాడలేకుండా పోయాయి.ఏజెన్సీలో కలుషిత నీటి వల్ల టైఫాయిడ్, విరేచనాలు, మలేరియా కేసులు నిశ్శబ్దంగా పెరుగుతున్నాయి. రవాణా సౌకర్యాలు లేక గిరిజనులు గడప దాటి ఆస్పత్రికి రావడానికే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తోంది.తాజాగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఏజెన్సీ ఏరియా జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో ఓ రివ్యూను కూడా ఏర్పాటు చేశారు. వ్యాధుల నియంత్రణకు ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగాలని సూచించారు. కానీ తాను రిటర్నైంట్ కు దగ్గరగానే ఉన్నాననే నిర్లక్ష్యంతో పబ్లిక్ హెల్త్ విభాగాన్ని పట్టింపు లేనట్లు వదిలేశారనే చర్చ ఆ కార్యాలయం ఉద్యోగులే చెప్తున్నారు.

Also Read: మెగా కోడలిపై భారీ ట్రోల్స్.. ఫ్యాన్స్ అసహనం!

కీలక సమయం ఇదే..

Advertisement

ప్రజారోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించాల్సిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయం. కానీ సరైన అధికారి లేనందున పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వాస్తవానికి ప్రతి ఏడాదీ మే, జూన్ నెలల్లోనే పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్యారోగ్య శాఖల సమన్వయంతో ‘యాంటీ లార్వా ఆపరేషన్లు’, ‘ఫాగింగ్’,‘డ్రై డే’ కార్యక్రమాలపై క్షేత్రస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు డీహెచ్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు లేవు,జిల్లాల అధికారులకు దిశానిర్దేశం లేదు. అధికారులు కేవలం నెలకు ఒకసారి లెక్కల సమీక్షకే పరిమితమవుతున్నారు తప్ప, ముందస్తు నివారణ చర్యలను గాలికి వదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీజనల్ యాక్షన్ ప్లాన్..

మరోవైపు శాఖల వారీగా బాధ్యతలను వివరిస్తూ గైడ్‌లైన్స్‌తో కూడిన “సీజనల్ యాక్షన్ ప్లాన్”ను వెంటనే విడుదల చేయాల్సి ఉన్నా..అదీ ప్రకటించలేదు.సీజనల్ సమయంలో ప్రభుత్వాస్పత్రుల్లో డెంగీ, మలేరియా నిర్ధారణ కిట్లు,ప్లేట్‌లెట్ ప్యాకెట్లు, ఐవి ఫ్లూయిడ్స్ పుష్కలంగా అందుబాటులో ఉంచాలి.అంతేగాక మారుమూల గ్రామాలకు ప్రత్యేక వైద్య బృందాలను పంపి జ్వరాల సర్వే నిర్వహించాలి.గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో నిలిచిపోయిన నీటిలో ఆయిల్ బాల్స్, ఏబీఎస్ స్ప్రేయింగ్ తక్షణమే చేపట్టి, నిరంతరం ఫాగింగ్ చేయించాలి. కానీ ఇవేమీ జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ప్రైవేట్ ఆసుపత్రులతోనూ నో రివ్యూస్.. లెక్కల్లో నో ట్యాలీ..

సీజనల్ వ్యాధులపై దోపిడి జరగకుండా ప్రతీ ఏడాది పబ్లిక్ హెల్త్ కార్యాలయం ప్రైవేట్ ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తుంది. కానీ ఈ ఏడాది అలాంటి మీటింగ్ , ఆదేశాలు కూడా వెళ్లలేదు. ఇక ఈ ఏడాది డెంగీ ఔట్ బ్రేక్ కు ఛాన్స్ ఉన్నదనే నేపథ్యంలో భారీ ఫీజులు వసూల్ చేసేందుకు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రెడీగా ఉన్నాయి. ఫీజుల నియంత్రణపై కూడా సమీక్ష జరగలేదు. గత ఆరు ఏళ్ల ట్రెండ్ ను పరిశీలిస్తే ఈ సారి డెంగీ కేసులు భారీగానే పెరిగే ఛాన్స్ ఉన్నది. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ లో డెంగీ కేసులు రికార్డు కావనే చర్చ కూడా ఉన్నది. దీనిపై వైద్యారోగ్యశాఖ అధికారులు కనీసం స్పందించలేని పరిస్థితులో ఉంటారు. నిత్యం పబ్లిక్ హెల్త్ విభాగం విడుదల చేసే రిపోర్టులు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పోలిక లేకుండా ఉంటుంది. అధికారిక లెక్కలకు ఆసుపత్రులలో కనిపించే కేసులకు చాలా వ్యాత్సాసం కనిపిస్తుంది. ఇప్పటికైన పబ్లిక్ హెల్త్ విభాగం మేల్కొనకపోతే, డెంగీ ఔట బ్రేక్ ను నియంత్రించడం కష్టమే అని పలువురు డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

Also Read: మహీంద్రా మాస్టర్ ప్లాన్.. ఒకేసారి 5 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Related News

జనగామలో అబార్షన్ తర్వాత తల్లి మృతి.. ఆడపిల్ల పుట్టడం నేరమా అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న ‘బిగ్ టీవీ’ యాంకర్

విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు, ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్

సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!

సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

Big Stories

Advertisement
×