Indian Railways Daily Income: భారతీయ రైల్వే సంస్థకు ప్రపంచంలో టాప్ 5 రైల్వే వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. భారతీయ జీవనాడిగా భావించే రైల్వే సంస్థ.. దేశ వ్యాప్తంగా ఏకంగా లక్ష కిలో మీటర్లకు పైగా రైల్వే లైన్లను కలిగి ఉంది. నిత్యం 20 వేలకు పైగా రైళ్లు ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. సుమారు 2 కోట్ల మందికి పైగా ప్రయాణీకులు రైల్వే ప్రయాణం చేస్తున్నారు. ప్రజల అసవరాలను తీర్చడానికి పలు రకాల రైళ్లను నడుపుతున్నారు రైల్వే అధికారులు. వందేభారత్ ఎక్స్ ప్రెస్ లాంటి అత్యాధునిక రైళ్ల నుంచి జనరల్ రైళ్ల వరకు తమ సేవలను కొనసాగిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది రైల్వే ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు.
భారతీయ రైల్వేలో మరిన్ని మైలు రాళ్లు
భారతీయ రైల్వే సంస్థ ఎప్పటికప్పుడు లేటెస్ట్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే అత్యాధునిక వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా, త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించబోతున్నది. అటు బుల్లెట్ రైళ్లు, హైడ్రోజన్ రైళ్లను పరిచయం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారతీయ ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత సామర్ధ్యం కలిగిన హైడ్రోజన్ రైలు ఇంజిన్ ను తయారు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 4 దేశాలు హైడ్రోజన్ రైలు ఇంజిన్లను తయారు చేస్తుండగా, భారత్ ఏకంగా 1200 హార్స్ పవర్స్ తో కూడిన రైలును తయారు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది భారతీయ రైల్వే మరిన్ని మైలు రాళ్లు అందుకోబోతున్నట్లు తెలిపారు.
రోజుకు భారతీయ రైల్వే ఆదాయం ఎంత అంటే?
భారతీయ రైల్వే సంస్థకు నిత్యం కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తున్నది. ప్రయాణీకులకు టికెట్లు విక్రయించడంతో పాటు సరుకు రవాణా ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం రైల్వే రోజుకు సుమారు రూ. 400 కోట్లు ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. ఇందులో కొంత భాగం టికెట్ల అమ్మకం ద్వారా లభిస్తుండగా, ఎక్కువగా సరుకు రవాణా ద్వారా వస్తున్నది. అయితే, రైల్వే మొత్తం ఆదాయంలో ప్రయాణీకులకు టికెట్ల ద్వారా వచ్చే ఇన్ కం కేవలం 20 శాతం కాగా, 75 శాతానికి పైగా సరుకు రవాణా ద్వారా లభిస్తుంది. మిగతా ఆదాయం ఇతర వనరుల ద్వారా లభిస్తున్నది.
Read Also: బుల్లెట్ రైళ్లు, హైస్పీడ్ ట్రైన్లు.. బడ్జెట్ లో రైల్వేకు భారీగా కేటాయింపులు!
2025-26లో భారతీయ రైల్వే ఆదాయ లక్ష్యం: 2005-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 1,800 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా రూ. 2,00,000 కోట్ల ఆదాయాన్ని పొందాలని భావిస్తున్నది. సుమారు రూ. 90 వేల కోట్లను టికెట్ల విక్రయం ద్వారా పొందాలని భావిస్తున్నది. ఛార్జీలు కాకుండా ఇతర ఆదాయం ప్రస్తుతం రూ. 10,500 కోట్లు ఉండగా, ఈ ఆదాయాన్ని 10-15%కి పెంచడానికి రైల్వే సంస్థ ప్రయత్నిస్తున్నది.
Read Also: నిమిషానికి 2.5 లక్షల టిక్కెట్ల జారీ, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!