BigTV English

Chiranjeevi: ఊహించని స్పందన.. అప్పుడే టికెట్లు అయిపోయాయా? చిరు.. శ్రీదేవి క్రేజ్ అలాంటిది

Chiranjeevi: ఊహించని స్పందన.. అప్పుడే టికెట్లు అయిపోయాయా? చిరు.. శ్రీదేవి క్రేజ్ అలాంటిది

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే జనాలు ఏ రేంజ్ లో థియేటర్స్ ముందు క్యూ కడతారో మరోసారి రుజువయింది. చిరంజీవి శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం రీ రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రం రిలీజ్ అయి 35 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా, ఈ నెల మే 9న థియేటర్లలో సందడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా రీ రిలీజ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు చూద్దాం.


ఊహించని స్పందన..

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. చిరంజీవి రాజు పాత్రలో సూపర్ కామెడీ టైమింగ్ తో తన డాన్సులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇక అతిలోక సుందరిగా శ్రీదేవి ఇంద్రజ పాత్రలో నటించి తన అందం, అభినయంతో సినిమాకు ప్రాణం పోశారు. ఈ మూవీలో ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రామిరెడ్డి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, బేబి షాలిని ముఖ్యపాత్రలో నటించి మెప్పించారు. ఇక అమ్రిష్ పూరి తన విలక్షణమైన విలన్ గా సినిమాలో భయపెట్టాడని చెప్పొచ్చు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో వస్తే ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా టీవీలకు అతుక్కుపోయి చూస్తారు. అలాంటి మూవీని మరోసారి థియేటర్లలో 2D , 3D ఫార్మేట్ లలో రీ రిలీజ్ చేయడం అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కి ఇంకొక నాలుగు రోజులు సమయం ఉన్న టికెట్స్ అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయని, థియేటర్లన్నీ హౌస్ ఫుల్ తో నిండిపోయాయని, ఊహించని విధంగా టికెట్స్ నాలుగు రోజులు ముందే హౌస్ ఫుల్ అయ్యాయని సమాచారం. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్.. ఇదంతా చిరు క్రేజ్ అని, చిరంజీవి సినిమా అంటే ఆ మాత్రం ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


కథ ఇలా సాగుతుంది ..

ఇక జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో రాజు అనే క్యారెక్టర్ లో చిరంజీవి మనకి కనిపిస్తారు. మూవీలో టూరిస్ట్ గైడ్ గా పని చేస్తూ నలుగురు అనాధ పిల్లలను పోషిస్తూ ఉంటారు. ఆ నలుగురిలో ఒక బాలుడు గాయపడడంతో మానస సరోవరం లో ఉన్న ఔషధం కోసం హిమాలయాలకు వెళ్తాడు. అదే సమయంలో ఇంద్రుడి కుమార్తె అయిన ఇంద్రజ పాత్రలో శ్రీదేవి భూమి మీదకి రావడం.. ఆ తరువాత వారిద్దరూ కలిసిపోవడం ఆమె ఉంగరాన్ని రాజు ధరించడం జరుగుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ రాజు ఇంటికి రావడం, ఆమె కోసం అమ్రిష్ పూరి మాంత్రికుడిగా ఆమెని కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత రాజు ఆమెను రక్షించడం, ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమించుకోవడం.. చివరికి ఇంద్రజని రాజు రక్షించడంతో కథ సుఖాంతం అవుతుంది.

ఈ చిత్రం మే 9న 1990 సంవత్సరంలో రిలీజ్ అయింది. రెండు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 15 కోట్లు వసూలు సాధించింది. చిరంజీవి నటించిన అన్ని సినిమాల్లోనే బ్లాక్ బస్టర్ రికార్డును సృష్టించింది. 1995 లోనే ఈ చిత్రానికి 5 నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ప్రతి పాట సూపర్ హిట్ ఆల్బమ్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు రిలీస్ కు 35 సంవత్సరాలు అయిన సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. చిరు, శ్రీదేవి ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ థియేటర్లలో రీ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×