Vande Bharat Express: భారత్ లో అధునాతన సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్. పూర్తి స్వదేశీ టెక్నాలజీ రూపొందిన ఈ రైలు గంటకు ప్రస్తుతం 130 నుంచి 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలును ఎంతో అనుభవం కలిగిన లోకో పైలెట్లు నడుపుతుంటారు. ఇంతకీ వందేభారత్ రైలును నడిపే లోకో పైలెట్ సాలరీ ఎంత ఉంటుంది? ఆ ఉద్యోగానికి కావాల్సి అర్హతలు ఏంటి? అనేది తెలుసుకుందాం..
వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంత?
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ జీతం సాధారణంగా నెలకు రూ. 55,000 నుంచి రూ. 85,000 వరకు ఉంటుంది. ఈ సాలరీలో టీఏ, డీఏతో పాటు ఓవర్ టైమ్, రన్నింగ్ అలవెన్సులు, నైట్ డ్యూటీ అలవెన్సులు కలిసి ఉంటాయి. వందే భారత్ రైళ్లను నడుపుతున్న లోకో పైలట్లు అదనంగా పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలను కూడా అందిస్తారు. సీనియారిటీ, ప్రమోషన్లతో సాలరీ మరింత ఎక్కువగా పెరుగుతుంది. కొన్నిసార్లు నెలకు రూ. 1 లక్ష కంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది.
వందే భారత్ లోకో పైలట్ కావాలంటే ఎలా?
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో నేరుగా లోకో పైలెట్ కావడం కుదరదు. ముందుగా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా కెరీర్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అసిస్టెంట్ లోకో పైలెట్ కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ విద్యా అర్హత: అసిస్టెంట్ లోకో పైలెట్ కావాలంటే 10వ తరగతి పాసై ఉండాలి. టెన్త్ క్లాస్ తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ లేదంటే ఇంజనీరింగ్ డిప్లమా అసవరం. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ లో ఏదో ఒక డిప్లమా ఉండాలి.
⦿ వయస్సు: అసిస్టెంట్ లోకో పైలెట్ కావాలంటే వయస 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయస విషయంలో సడలింపులు ఉంటాయి.
⦿ RRB ALP పరీక్ష: అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్ష కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలో పాస్ కావాలి. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్ పాస్ కావాలి.
Read Also: మనం రైలు కొనేయొచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్.. ఇండియాలో సాధ్యమేనా?
⦿ ట్రైనింగ్: అన్ని పరీక్షలు పాసై ఉద్యోగానికి ఎంపిక అయిన తర్వాత శిక్షణ అందిస్తారు. ఇందులో డ్రైవింగ్ సెషన్లు, భద్రతా విధానాలు, సాంకేతిక శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత అసిస్టెంట్ లోకో పైలెట్ గా పోస్టింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఎక్స్ పీరియెన్స్ పనితీరు ఆధారంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ లాంటి ప్రతిష్టాత్మక రైళ్లను నడపడానికి అవకాశం లభిస్తుంది. మంచి సాలరీ కూడా పొందే అవకాశం ఉంటుంది.
Read Also: రైల్వే టీసీ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటి? ఫస్ట్ సాలరీ ఎంతో తెలుసా?
Read Also: అమ్మో, రైలు టికెట్ కలెక్టర్లు అన్ని గంటలు పనిచేస్తారా?