సాధారణంగా విమానంలో ప్రయాణీకులు ల్యాప్ బెల్టులను ఉపయోగిస్తారు. కానీ, క్యాబిన్ క్రూ ఉపయోగించే బెల్టులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రయాణీకుల మాదిరిగా కాకుండా, అదనపు భద్రత కోసం క్యాబిన్ సిబ్బంది షోల్టర్ బెల్టులతో కూడిన ప్రత్యేక సీట్ బెల్టులను ఉపయోగిస్తారు. ఈ హార్నెస్ లు అత్యవసర సమయాల్లో సిబ్బందిని సురక్షితంగా ఉంచేందుకు సాయపడుతాయి. ఎందుకంటే వారు సేఫ్ గా ఉంటే ఇతరులకు సాయం చేసేందుకు వీలు అవుతుంది. ఇంతకీ విమానంలో ప్యాసింజర్లు, క్యాబిన్ క్రూ ఉపయోగించే సీట్లలో తేడాలు ఏంటి? ఎందుకు విమాన సిబ్బంది ప్రత్యేక బెల్టులను ఉపయోగిస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
క్యాబిన్ క్రూ సీట్ బెల్టులు ఎందుకు భిన్నం?
క్యాబిన్ క్రూ సీట్ బెల్టులు ప్యాసింజర్ బెల్టుల మాదిరిగా ఉండవు. వాళ్లు మరింత భద్రత కోసం అదనపు పట్టీలతో కూడిన ప్రత్యేక హార్నెస్ లను ఉపయోగిస్తారు. ఈ బెల్టులు సిబ్బంది సభ్యులను సురక్షితంగా ఉంచుతాయి. వారు సేఫ్ గా ఉంటేనే, విమానంలోని ప్రయాణీకులకు సేవలు అందించే అవకాశం ఉంటుంది.
అదనపు భద్రత కోసం అదనపు బెల్టులు
క్యాబిన్ సిబ్బంది భుజాలపై, వారి ఒడి మీద పట్టీలతో కూడిన నాలుగు పాయింట్ హార్నెస్ ను ధరిస్తారు. విమానం కల్లోల పరిస్థితులలో చిక్కుకున్న సందర్భంలో, విమానంలో ఏదైన సమస్య తలెత్తినప్పుడు వారు ధరించిన ‘X’ ఆకారం బెల్ట్ వారిని కాపాడుతుంది. ఎందుకంటే, ప్రయాణీకుల మాదిరిగా కాకుండా, క్యాబిన్ సిబ్బందికి ముందు ఎలాంటి సీట్లు ఉండవు. జంప్ సీట్ల మీద కూర్చుంటారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్, హార్డ్ బ్రేకింగ్ సమయంలో వారు ముందుకు విసిరేసినట్లుగా ప్రభావం పడుతుంది. అలా కాకుండా హార్నెస్ అడ్డుకుంటుంది.
ఈజీగా తీసే అవకాశం
క్యాబిన్ క్రూ సీట్ బెల్ట్ లకు ఈజీ రిలీజ్ బకిల్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో, సిబ్బంది ఒకేసారి అన్ని పట్టీలను విప్పి, ప్రయాణీకులను విమానం నుండి బయటకు తీసుకురావడానికి సాయపడేలా ఉంటాయి.
ప్రయాణీకుల కోసం సాధారణ ల్యాప్ బెల్టులు
విమానం క్యాబిన్ క్రూ మాదిరిగా కాకుండా ప్రయాణీకులు సాధారణ ల్యాప్ బెల్ట్ ను ఉపయోగిస్తారు. దీనిని పెట్టుకోవడం, తీయడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ త్వరగా బెల్టు తీసి బయటకు వెళ్లేలా చేస్తుంది. అంతేకాదు, ముందున్న సీటు వెనుక వైపు ఉన్నన ప్రయాణీకులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రయాణికుల బెల్ట్ లు సౌకర్యంగా ఉండటంతో పాటు సులభమైన ఉపయోగం కోసం రూపొందించబడ్డాయి. సంక్లిష్టమైన హార్నెస్‌లు దీర్ఘ విమానాలకు అసౌకర్యంగా ఉంటాయి. సరళమైన డిజైన్ అన్ని పరిస్థితులకు అనుగుణంగా పని చేస్తుంది.
విమానంలో ఉన్న అందరికీ భద్రత
క్యాబిన్ సిబ్బందికి బలమైన బెల్టులు అత్యంత అవసరం. ఎందుకంటే, వారు సురక్షితంగా ఉండాలి. ఏదైనా అత్యవసర పరిస్థితిలో సహాయం చేయడానికి వారే ముందు ఉంటారు. అందుకే, వారి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ బెల్టులను రూపొందించారు.
Read Also: ఒకే యువతిని పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు.. ఆ ఊరిలో ఇదే సాంప్రదాయమట!