PM Kisan: తెలంగాణలో రైతు భరోసాలాగా కేంద్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలువుతోన్న విషయం తెలిసిందే. మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని మోదీ సర్కార్ 2019లో రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీంను ప్రారంభించింది. ఈ స్కీం ద్వారా రూ.6వేలను రైతుల అకౌంట్లలో జమచేస్తున్నారు. ఏడాదికి మూడు విడతల్లో రూ.2వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో జమఅవుతోంది. అయితే దేశ వ్యాప్తంగా కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు నిన్ననే (జులై 18న) అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని భావించారు. కానీ జమ కాకపోవడంతో రైతులు నిరాశ చెందారు.
పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఎప్పుడు అకౌంట్లలో క్రెడిట్ అవుతాయి..? అసలు ఈ ఆలస్యానికి గల కారణాలు ఏంటి..? రైతులు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి..? కొత్తగా పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలని అనుకునే వారు ఏం చేయాలి.? అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
⦿ ఆలస్యానికి గల కారణాలు:
కొంత మంది రైతులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో తప్పులు చేసినట్టు తెలుస్తోంది. రైతుల ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాల్లో మిస్టేక్స్ చేయడం వల్ల వాటిని సరిచూసే ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడం కూడా ఓ కారణం. చాలా రాష్ట్రాల్లో రైతులు ఇంకా ఈ- కేవైసీ పూర్తి చేయలేదు. ఇది పూర్తి చేసిన వారి ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ అవ్వనున్నాయి. ఆధార్-బ్యాంక్ ఖాతా లింక్ సమస్యలు వల్ల కూడా లేట్ అయి ఉండొచ్చు. రైతులు ఆధార్ నంబర్ తో వారి బ్యాంక్ ఖాతాను కరెక్టుగా లింక్ చేసి ఉండాలి. డబ్బులు నేరుగా ఆధార్ – ఆధారిత చెల్లింపుల ద్వారా జరుగుతాయి. కాబట్టి ఈ ఆధార్ తో బ్యాంక్ ఖఆతాను లింక్ చేసుకోవాలి. మోదీ సర్కార్ అర్హులైన రైతులకు మాత్రమే నిధులు జమ అయ్యేలా చూస్తోంది. అందుకే పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఆలస్యం అవుతోందని సమాచారం.
⦿ డబ్బులు ఎప్పుడు జమ కావొచ్చు..?
అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక సమాచారం రైతులకు అందలేదు. ప్రభుత్వం కూడా త్వరగా డబ్బులు అందజేసే ప్రక్రియలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల చివరలో లేదా ఆగస్టు మొదటి వారంలో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రైతుల అకౌంట్లలో జమ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.
⦿ రైతులు వెంటనే ఇలా చేయండి..
ముందుగా ఇప్పటి వరకు ఈ- కేవైసీ పూర్తి చేసుకోని వారు వెంటనే ఈ పని పూర్తి చేయండి. మీ ఆధార్ నంబర్ తో ఓటీపీ లేదా బయోమెట్రిక్ విధానంలో ఈ- కేవైసీ కంప్లీట్ చేసుకోండి. మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ- కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. లేదా పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ ద్వారా అయినా చేసుకోవచ్చు. అలాగే భూ వివరాల స్టేట్ గవర్నమెంట్ వెబ్ సైట్ లో కరెక్టుగా ఉన్నాయో చెక్ చేసుకోండి. భూ రికార్డులు సరిగ్గా లేకపోతే.. వెంటనే మీ వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించి వివరాలను అందజేయండి. ఆధార్ తో బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోండి (చేసుకోని వారు మాత్రమే). మీ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ లోని మీ పేరు, చిరునామా వివరాలు సేమ్ ఉండాలి. ఏమైనా తేడాలు ఉండే సవరించండి.
⦿ డబ్బులు జమ కాకపోతే.. ఇలా చేయండి..
బెనఫీషియరీ స్టేటస్ చెక్ చేసుకోవాలి. పీఎం కిసాన్ పోర్టల్ బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ ను ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు. ఎఫ్‌టీవో జనరేటేడ్ అండ్ పేమెంట్ కన్ఫర్మేషన్ ఇస్ పెండింగ్ అని వస్తే త్వరలో డబ్బు జమ కానుందని అర్థం. పీఎం కిసాన్ నిధుల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే 155261 లేదా 1800115526 నంబర్లకు కాల్ చేయండి..
ALSO READ: Collector Swapnil Dinkar: ఈ కలెక్టర్ పని తీరు అద్భుతం.. రూ.500 కోట్లు ఖర్చు పెట్టి..?
ALSO READ: HYDRA: ఇది హైడ్రా గొప్పదనం.. ఒక్క ఏడాదిలోనే 500 ఎకరాలు, 20 చెరువులు..!