Tirupati- Pakala- Katpadi Doubling Works: ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పరిధిలోని తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (104 కి.మీ) డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.1,332 కోట్లతో డబ్లింగ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ పనులతో ఇరు ప్రాంతాల నడుమ ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపనచడంతో పాటు లాజిస్టిక్ ఖర్చును గణనీయంగా తగ్గించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. చమురు వినియోగాన్ని తగ్గించడంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపుకు దోహదం చేస్తుందని వివరించింది.
400 గ్రామాలు, 14 లక్షల జనాభా కనెక్టివిటీ
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏకంగా 400 గ్రామాలకు, సుమారు 14 లక్షల మంది జనాభాకు కనెక్టివిటీ పెరగనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలు తెలిపారు. “తిరుపతి-పాకాల-కాట్పాడి ప్రాజెక్ట్ ద్వారా తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి కనెక్టివిటీని పెండమే లక్ష్యంగా పెట్టుకున్నాం. తిరుమల ఆలయాన్ని నిత్యం సుమారు 75,000 మంది భక్తులు సందర్శించకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తిరుపతికి రెట్టింపు యాత్రికులు వస్తున్నారు. వారందరికీ ఈ ప్రాజెక్టు పూర్తి అయితే, ప్రయాణం మరింత సులభతరం కానుంది” అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి
ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏపీ, తమిళనాడు మధ్యగత తిరుపతి-పాకాల-కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (104 కి.మీ) డబ్లింగ్‌కు ఆమోదం తెలిపింది తెలిపిందిని అశ్విని వైష్ణవ్ వివరించారు. ఈ మల్టీ ట్రాకింగ్ ప్రతిపాదన రైల్వే కార్యకలాపాలను మరింత సులభతరం చేస్తుందన్నారు. రద్దీని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. “ ఈ ప్రాజెక్ట్ మల్టీ-మోడల్ కనెక్టివిటీని పీఎం గతి శక్తి నేషన్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలలోని మూడు జిల్లాలను కవర్ చేస్తుంది. తిరుమల వెంకటేశ్వర ఆలయానికి కనెక్టివిటీతో పాటు, శ్రీకాళహస్తి, కాణిపాకం, చంద్రగిరి వంటి ప్రముఖ ప్రదేశాలకు రైల్వే కనెక్టివిటీని అందిస్తుంది. దేశవ్యాప్తంగా యాత్రికులను, పర్యాటకులను ఆకర్షించడానికి సహాయపడుతుంది” అని చెప్పుకొచ్చారు.
గూడ్స్ రవాణాలోనూ కీలక పాత్ర
అటు ఈ రైల్వే లైన్ ద్వారా గూడ్స్ రవాణా కూడా మెరుగుపడనున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. “బొగ్గు, వ్యవసాయ వస్తువులు, సిమెంట్, ఇతర ఖనిజాల రవాణాకు ఇది ఒక ముఖ్యమైన మార్గం. డబ్లింగ్ తో సంవత్సరానికి మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా జరుగుతుంది. దీని వలన దేశ ఆర్ధిక ప్రగతి మరింత పెరుగుతంది” అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.
Read Also: టికెట్ ఛార్జీలపై 10% ఇన్ స్టంట్ డిస్కౌంట్.. మెట్రో ప్రయాణీకులకు అదిరిపోయే ఆఫర్!
Cabinet Briefing by Union Minister @AshwiniVaishnaw @PIB_India https://t.co/T3GJNftW5i
— Ministry of Information and Broadcasting (@MIB_India) April 9, 2025
Read Also: చర్లపల్లి సమీప మెట్రో స్టేషన్ ఏమిటీ? అక్కడ రైలు దిగితే సిటీకి చేరడం ఎలా?