Indian Railways: దేశానికి తలమాణికం అయిన జమ్మూకాశ్మీర్ కు, దేశంలోని ఇతర ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. రీసెంట్ గా జమ్మూ రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేయగా, త్వరలో ప్రతిష్టాత్మకమైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇప్పటికే జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు అత్యాధునిక వందేభారత్ రైలు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ మార్గంలో వందేభారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ ప్రజలకు భారతీయ రైల్వే సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జమ్మూ-కాశ్మీర్ నడుమ సర్వీసుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మూడు కొత్త రేక్ లను నార్త్ రైల్వేకు అందించింది. ఈ ట్రైన్ సెట్లు ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ లో నడవనున్నాయి. వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో సహా ఈ రైళ్లన్నీ ఉత్తర రైల్వే జోన్ ఆధ్వర్యంలో నడుస్తాయి.
జమ్మూ నుండి శ్రీనగర్ రైల్వే రూట్
కాశ్మీర్ లోయలో సెమీ హై స్పీడ్, ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా రూట్ ను ఖారారు చేయలేదు. తొలుత ఈ రైలు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా (SVDK), శ్రీనగర్ మధ్య నడపాలని అధికారులు నిర్ణయించారు. అయితే, రైల్వే సంస్థ బుద్గాం వరకు ట్రయల్ రన్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో రైలు కత్రా- బుద్గాం మధ్య నడుస్తుందని అందరూ భావిస్తున్నారు.
జమ్మూ- శ్రీనగర్ కోసం ప్రత్యేక రూపొందించిన ట్రైన్ సెట్లు
జమ్మూ-కాశ్మీర్ రూట్ లో నడిచే స్పెషల్ ట్రైన్ సెట్లను కపుర్తల ఆధారిత రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) తయారు చేసింది. ఈ మూడు లింక్- హాఫ్‌మన్- బుష్ (LHB) రైలు సెట్లు ఇప్పటికే నార్త్ రైల్వేకు అందించింది.
కాశ్మీర్ లోయ రూపొందించిన ట్రైన్ సెట్ల ప్రత్యేకతలు
ఈ సరికొత్త ట్రైన్ సెట్లను పూర్తిగా ఎయిర్ కడిషన్డ్ తో రూపొందించారు. లోయలోని వాతావరణానికి అనుకూలంగా రూపొందించారు. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత చక్కగా జర్నీ చేసేలా తాయారు చేశారు. ఈ రేక్‌ల రూపం సాధారణ LHB రేక్‌ల మాదిరిగానే ఉంటుంది. కానీ సాధారణ స్వింగ్ తలుపులకు బదులుగా తేజస్ రేక్‌ల వంటి ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. కోచ్ లలో హీట్ సామర్థ్యాన్ని పెంచడం, వాటర్ ట్యాంకుల థర్మల్ ఇన్సులేషన్, బయో ట్యాంకులు, పైప్ లైన్లు, కుళాయిలలో వెచ్చని నీటి కోసం గీజర్లు లాంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటాయి. తీవ్రమైన చలి వాతావరణంలో USBRL విభాగంలో పనిచేయడానికి అనుకూలంగా తీర్చదిద్దారని నార్త్ రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ వర్మ వెల్లడించారు.
అత్యంత చలి వాతావరణంలో నీరు గడ్డకట్టకుండా నిరోధించడానికి, ఈ కోచ్ లలోని వాటర్ పైపు లైన్లలో సెల్ఫ్ రెగ్యులేటింగ్ హీటింగ్ కేబుల్స్, ఇన్సులేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోచ్ లను వెచ్చగా ఉంచడానికి అధిక సామర్థ్యం గల AC యూనిట్ (RMPU) కూడా ఏర్పాటు చేశారు.
Read Also: రైల్వేమంత్రితో టికెట్ బుక్ చేయించాలి, తత్కాల్ ఇబ్బందులపై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!