Hyderabad Crime News: హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొన్ని వారాల క్రితం ఆకాష్(25) అనే యువకుడికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. వారి పెళ్లి వచ్చే నెలలో జరగనుంది. అయితే సోమవారం రోజున ఆకాష్ తనకు కాబోయే భార్యకు కాల్ చేసి ఔట్ సైడ్ ట్రిప్ కు వెళ్దామని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో ఆకాశ్ బ్లాక్ మెయిల్ చేద్దామని ప్రయత్నం చేశాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే అతను ఉరి వేసుకున్నానని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అతను కుర్చీ దిగే క్రమంలో అకస్మాత్తుగా మెడకు ఉచ్చు బిగుంచుకుని ఊపిరాడక మృతిచెందాడు.
పోలీసులు వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన ఆకాష్(25) కు కొన్ని రోజుల క్రితం ఓ యువతితో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. వివాహం మరో నెల రోజుల్లో జరగాల్సి ఉంది. ఏప్రిల్ నెలలో మ్యారేజ్ ఫిక్స్ చేవారు. అయితే.. ఆకాశ్ సోమవారం రోజున తనకు కాబోయే భార్య కాల్ చేశాడు. బైక్ పై బయటకు వెళ్దామని యువతిని అడిగాడు. యువకుడితో బయటకు వెళ్లడానికి యువతి తిరస్కరించింది. దీంతో ఆ యువతిని బెదరించడానికి ఆకాశ్ ప్రయత్నించాడు. యువకుడు తాడుతో ఉరి వేసుకోవడానికి ప్రయత్నం చేశాడు.
యువతికి వీడియో కాల్ చేేసి.. తన మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అనంతరం కోపంతో ఫోన్ కట్ చేశాడు. అయతే ఆకాశ్ కుర్చీ నుంచి దిగే క్రమంలో జారి పడ్డాడు. దీంతో మెడ చుట్టూ ఉచ్చు బిగుంచుకుంది. గొంతుకు తాడు గట్టిగా పట్టివేయడంతో యువకుడు ఊపిరి ఆడక మృతిచెందాడు. ఆకాశ్ ఆత్మహత్యాయత్నం చేసుకునే సమయంలో ఇంట్లో ఎవరూ లేరని కాచిగూడ ఎస్ఐ నరేష్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.