Driverless Trains: భారతీయ రైల్వే వ్యవస్థ రోజు రోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పటికే వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, మరికొద్ది రోజుల్లోనే నమో భారత్ ట్రైన్లు తమ సేవలను ప్రారంభించబోతున్నారు. కేరళ కేంద్రంగా తమ సర్వీసులను అందించబోతున్నాయి. ఇక త్వరలోనే సరికొత్త రైళ్లు పరిచయం కాబోతున్నాయి. డ్రైవర్ లెస్ రైళ్లు ట్రాక్ ఎక్కబోతున్నాయి. ఇంతకీ ఈ రైళ్లు ఎక్కడ ప్రారంభం అవుతున్నాయంటే..
చెన్నై మెట్రోలోకి డ్రైవర్ లెస్ రైళ్లు ఎంట్రీ
భారత్ లో తొలిసారి డ్రైవర్ లెస్ రైళ్లు చెన్నై మెట్రోలోకి అడుగు పెట్టబోతున్నాయి. చెన్నై మెట్రోలో భాగంగా రెండో ఫేజ్ పనులు కొనసాగుతున్నాయి. రూ. 63,246 కోట్లతో ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చెన్నై మెట్రోలోకి మొత్తం 9 డ్రైవర్ లెస్ రైళ్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మూడు డ్రైవర్ లెస్ రైళ్లు తమ సేవలను ప్రారంభించనున్నాయి. ఇప్పటికే తొలి డ్రైవర్ లెస్ మెట్రో రైల్ పూనమల్లిలోని చెన్నై మెట్రో రైల్ డిపోకు చేరుకుంది. అక్టోబర్ లోనే ఓ రైల్ డెలివరీ కాగా, రెండవ రైలు వచ్చే నెలలో డెలివరీ చేయబడుతుంది. ప్రస్తుతం ఈ రైళ్లను శ్రీసిటీలోని ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి.
చెన్నై మెట్రో ఫేస్ 2 ప్రాజెక్టు గురించి..
చెన్నై మెట్రో ఫేస్ 2 ప్రాజెక్టుకు 118.9 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్నారు. మొత్తం మూడు కారిడార్లలో నిర్మాణం జరుగుతుంది. చెన్నై నగరంలో లక్షలాది మంది ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. మాధవరం నుంచి సిప్ కాట్, లైట్ హౌస్ నుంచి పూనమల్లి, మాధవరం నుండి షోలింగనల్లూర్ మార్గాల్లో ఈ రైల్వే లైన్లను నిర్మిస్తున్నారు. ఈ మూడు కారిడార్లు చెన్నైలోని దాదాపు అన్ని కీలక ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ వెళ్తాయి.
డ్రైవర్ లెస్ రైళ్లు ఎక్కడి నుంచి సేవలు కొనసాగిస్తాయంటే?
ప్రస్తుతం పని చేస్తున్న 54 కి.మీ ఫేస్ 1 నెట్ వర్క్ నుంచి ఫేస్ 2 ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఫేజ్ 1లో డ్రైవర్లతో కూడిన నాలుగు కోచ్ ల రైళ్లు నడుస్తున్నాయి. ఫేజ్ 2 నెట్ వర్క్ లో మూడు కోచ్ ల డ్రైవర్ లెస్ రైళ్లు ఉంటాయి. ఆదరణ పెరిగిన కొద్దీ ఫేజ్ 2 ప్రాజెక్ట్ లో ఆరు కోచ్‌ల రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
Read Also: ఓడియమ్మ.. ఒకే రోజు 3 కోట్ల మంది రైలు ప్రయాణం, రైల్వే చరిత్రలోనే అరుదైన రికార్డు
టెస్టింగ్ లో డ్రైవర్ లెస్ ట్రైన్లు
తొలి డ్రైవర్ లెస్ ట్రైన్ ను గత కొద్ది వారాలుగా పరీక్షిస్తున్నట్లు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) అధికారులు వెల్లడించారు. “ఇప్పటి వరకు దాదాపు 50% స్టాటిక్ పరీక్షలు పూర్తయ్యాయి. అన్నీ పరీక్షలు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాయి. ఎలాంటి సమస్యలు లేవు. రైళ్లలోని అన్ని యూనిట్లను తనిఖీ చేస్తున్నాం. డైనమిక్ టెస్టులు, ట్రయల్ రన్, రైలు వేగం సహా అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం” అని చెన్నై మెట్రో అధికారులు వెల్లడించారు.
Read Also: ఈ సారి 3 భాషలు కాదు.. ఏకంగా 12 భాషల్లో రైల్వే అనౌన్స్ మెంట్, ఎప్పుడు.. ఎక్కడంటే?