BigTV English

China’s Artificial Island Airport: సముద్రం మధ్యలో విమానాశ్రయం, అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్న డ్రాగన్ కంట్రీ!

China’s Artificial Island Airport: సముద్రం మధ్యలో విమానాశ్రయం, అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్న డ్రాగన్ కంట్రీ!

టెక్నాలజీ పరంగా చైనా కొత్తపుంతలు తొక్కుతున్నది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైళ్లను రూపొందించిన చైనా, ఇప్పుడు విమానాశ్రయాలపై ఫోకస్ పెట్టింది. సముద్రంలో అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఐలాండ్ ఎయిర్ పోర్టును నిర్మిస్తున్నది. లియోనింగ్ ప్రావిన్స్‌ లోని డాలియన్ నగరాన్ని ఆనుకుని ఉన్న సముద్రాన్ని పూడ్చి ఏకంగా ఓ సరికొత్త ఐలాండ్ ను తయారు చేస్తున్నది. దీని మీద అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మించనుంది. ఈ అద్భుతమైన ప్రాజెక్టు డ్రాగన్ కంట్రీ ఇంజినీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలువబోతున్నది.


ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం

చైనా నిర్మిస్తున్న ఆర్టిఫీషియల్ ఐలాండ్ ఎయిర్ పోర్టుకు డాలియన్ జిన్‌జౌవాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టుగా నామకరణం చేశారు. ఈ విమానాశ్రయాన్ని డాలియన్ ఝౌషుయిజీ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్నారు. మొత్తం 20.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాలుగా కొనసాగుతున్న హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (12.48 చ.కి.మీ), జపాన్‌లోని కన్సాయ్ విమానాశ్రయం (10.5 చ.కి.మీ) రికార్డులు బ్రేక్ కానున్నాయి. ఈ రెండు విమానాశ్రయాలు కూడా ఆర్టిఫీషియల్ ఐలాండ్ లోనే నిర్మాణం అయ్యాయి.


ఆర్టిఫీషియల్ ఐలాండ్ ను నిర్మిస్తున్న చైనా

చైనాలోని డాలియన్ సిటీకి చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ నగరంలో సుమారు 60 లక్షల మంది జానాభా ఉంటుంది. ఇది జపాన్, సౌత్ కొరియా దేశాలకు సమీపంలో ఉంటుంది. వాణిజ్య పరంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతం. ఇక్కడ ఆయిల్ ప్రాసెసింగ్, షిప్పింగ్, లాజిస్టిక్స్, సముద్ర తీర పర్యాటక రంగానికి ముఖ్య ప్రాంతంగా కొనసాగుతున్నది. అంతర్జాతీయ వాణిజ్యంలోనూ ఈ నగరం కీలక పాత్రపోషిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆర్టిఫీషియల్ ఎయిర్ పోర్టును నిర్మించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే సముద్రాన్ని పూడ్చి భూమిని సృష్టిస్తున్నది. అత్యాధునిక సాంకేతికతతో పాటు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, కంకరను ఉపయోగిస్తున్నారు. కృత్రిమ ద్వీపాన్ని నిర్మిస్తున్నారు.

ఏడాదికి 4.3 కోట్ల మంది ప్రయాణం

ఈ విమానాశ్రయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు చైనా ప్లాన్ చేస్తున్నది. ఈ ఎయిర్ పోర్టులో 4 అతిపెద్ద రన్ వేలు నిర్మించనున్నారు. దాదాపు 9 లక్షల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో అద్భుతమైన టెర్మినల్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ టెర్మినల్ ద్వారా ఏడాదికి 4.3 కోట్ల మంది ప్రయాణించేలా నిర్మిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 8 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడి నుంచి ఏడాదికి 10 లక్షల టన్నుల సరుకు రవాణా జరగనున్నది.

Read Also: ఇకపై జర్నీ చేయాలంటే టికెట్ తో పాటు అది కూడా ఉండాల్సిందే! ఇండియన్ రైల్వే సరికొత్త రూల్!

2035లో అందుబాటులోకి..

ఈ ప్రాజెక్టు కోసం చైనా ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నది. సుమారు 4.3 బిలియన్ డాలర్ల బడ్జెట్ ను కేటాయించింది. ఈ విమానాశ్రయాన్ని 2023 వరకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది.  వచ్చే ఆగష్టు నాటికి విమానాశ్రయానికి అనుకూలంగా భూమిని చదును చేయనున్నారు. ఆ తర్వాత టెర్మినల్ నిర్మాణం ప్రారంభంకానుంది. రానున్న 100 ఏండ్ల పాటు సేవలు అందించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు.

Read Also: ఇదేం పైత్యం రా బాబు! ఏకంగా రైలు ఇంజిన్ మీదకు ఎక్కి ప్రయాణం

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×