No Plane Flying Region: ప్రపంచంలో ఎన్నో వింతైన ప్రాంతాలు ఉన్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ లాంటి మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి విమానం వెళ్లిందంటే గల్లంతు కావాల్సిందే. అందుకే, ఈ ప్రాంతంపై ఆంక్షలు విధించారు. కానీ, ప్రపంచంలో ఎలాంటి ఆంక్షలు లేకపోయినా ఓ ప్రాంతం మీది నుంచి విమానాలు వెళ్లవు. విమానాన్ని ఆ ప్రాంతం మీది నుంచి తీసుకెళ్లేందుకు ఏ పైలెట్ సాహసించడు. ఆంక్షలు లేకపోయినా.. ఎందుకు అక్కడ నుంచి విమానాలు వెళ్లవు? రాకపోకలకు అంతరాయం కలిగించే అంశాలు ఏంటి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రపంచంలో విమానాలు ఎగరని ప్రదేశం
ప్రపంచంలో విమానాలు ఎగరని ఏకైక ప్రదేశం టిబెట్ పీఠభూమి. ఈ ప్రాంతం మొత్తం సుమారు 12 లక్షల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో 8 విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. విమాన రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేవు. అయినప్పటికీ.. ఈ ప్రాంతం మీదుగా వెళ్లవు. ఇందుకు ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి.
⦿ వాతావరణ పరిస్థితులు
ఈ ప్రాంత మీదుగా విమానాలు ప్రయాణించకపోవడానికి ప్రధాన కారణం వాతావరణం. టిబెట్ లో వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది. బలమైన గాలులు వీస్తాయి. ఈ గాలులు ఎప్పుడు, ఎటువైపు దిశ మార్చుకుంటాయో ఊహించలేం. అంతేకాదు, ఈ ప్రాంతంలో భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈ వాతావరణ పరిస్థితులు విమాన ప్రయాణాలకు అనుకూలంగా ఉండవు. ఈ ప్రాంతం నుంచి విమానాలు నడపాలంటే పైలెట్లు భయపడుతారు.
⦿ ఎత్తైన పర్వాతాలు
ఈ ప్రాంతంలో విమానాలు ఎగరకపోవడానికి మరో ముఖ్యమైన కారణం అత్యంత ఎత్తైన పర్వతాలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం కూడా ఇదే ప్రాంతంలో ఉంటుంది. ఈ పర్వతం సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. విమానాలు అత్యధికంగా 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. అకస్మాత్తుగా ఏవైనా సమస్యలు ఏర్పడితే విమానాలు 10 వేల అడుగుల దిగువకు వస్తాయి. కానీ, ఇక్కడ ఎత్తైన పర్వాతాలు ఉన్న కారణంగా క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో ల్యాండింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే, ఈ ప్రాంతాన్ని పైలెట్లు అవాయిడ్ చేస్తారు.
Read Also: సమ్మర్ కి టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఏపీకి 24 స్పెషల్ రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే!
టిబెట్ లో 8 విమానాశ్రయాలు
ఈ ప్రాంతంలో విమానాలు ఎక్కువగా తిరగనప్పటికీ 8 విమానాశ్రయాలు ఉన్నాయి. ప్రజా రవాణా కోసం వీటిని ఏర్పాటు చేసినప్పటికీ, ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో ప్యాసింజర్ విమానాలను నడిపేందుకు విమానయాన సంస్థలు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సదరు విమానాశ్రయాలను సరుకు రవాణా కోసం కార్గో విమానాలను నడుపుతున్నారు. అవి కూడా చాలా తక్కువగా నడుస్తాయి. ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సౌకర్యాలు కూడా ఎక్కువగా లేవు. పైలెట్లకు సమాచారం అందించడం కష్టంగా ఉంటుంది. అందుకే కార్గో విమానాలు తక్కువగా రాకపోకలను కొనసాగిస్తాయి.
Read Also: రైల్వే తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్ ఇవే.. చెక్ చేసుకోండి!