BigTV English

Strong Naturist Countries: ఈ దేశాల్లో నగ్నంగా ఉండటం తప్పు కాదు, ఇండియాలోనూ ఆ కలర్చర్ ఉందని మీకు తెలుసా?

Strong Naturist Countries:  ఈ దేశాల్లో నగ్నంగా ఉండటం తప్పు కాదు, ఇండియాలోనూ ఆ కలర్చర్ ఉందని మీకు తెలుసా?

ప్రపంచంలో అనేక రకాల ప్రజలు.. అనేక రకాల సంప్రదాయాలను పాటిస్తున్నారు. ఎన్నో తెగల్లో మరెన్నో సంస్కృతులు ఉన్నాయి. పలు దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా కనిపించడాన్ని నిషేధించాయి. అదే సమయంలో కొన్ని దేశాల్లో నగ్నంగా ఉండటాన్ని చట్టబద్దం చేశాయి. మన దేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో నగ్నంగా తిరిగే మనుషులు ఉన్నారు. ఇంతకీ బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా ఉండేందుకు అనుమతించే దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


⦿ జర్మనీ  

జర్మనీలో ఫ్రీ కోర్పెర్ కల్చర్ (FKK) అనే సంస్కృతి ఉంది. ఇది ఓ నగ్నత్వ సంస్కృతి. దీనినే అక్కడ ‘ఫ్రీ బాడీ కల్చర్’గా పిలుస్తారు. మ్యూనిచ్‌ లోని ఇంగ్లీష్ గార్డెన్ లాంటి అనేక పబ్లిక్ పార్కులలో నగ్నం ఉండవచ్చు.  బెర్లిన్ సరస్సులు, బాల్టిక్ సముద్ర తీరం చుట్టూ ఉన్న బీచ్ లలోనూ చాలా మంది నగ్నంగా ఉంటారు. జర్ననీలోని చాలా ప్రాంతాల్లో నగ్నంగా ఉన్నా, ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పరు. నగ్నత్వం అనేది అక్కడి వెన్నెస్ సంస్కృతిలో భాగంగా భావిస్తారు.


⦿ ఫ్రాన్స్

ఫ్రాన్స్ లో నగ్నత్వం అనేది తప్పుకాదు. కాప్ డి’అగ్డే నేచురిస్ట్ విలేజ్ లో దుకాణాలు, రెస్టారెంట్లు, బ్యాంకులలో కూడా ప్రజలు నగ్నంగా ఉన్నా ఎవరూ ఏమీ అనరు. ప్లేజ్ డి తాహితీ (సెయింట్ ట్రోపెజ్), ఇలే డు లెవాంట్ లాంటి పలు   నగ్నత్వ బీచ్‌ లు కూడా ఉన్నాయి.

⦿ స్పెయిన్

స్పెయిన్‌ లోనూ బహిరంగ నగ్నత్వం అనేది చట్టవిరుద్ధం కాదు. అక్కడ నగ్నంగా తిరగవచ్చు. కానీ, చాలా మంది బీచ్ లు, సరస్సుల దగ్గరే నగ్నంగా ఉండేందుకు ఇష్టపడుతారు. ప్లేయా డి బోలోనియా (తారిఫా),  ప్లేయా డి సెస్ ఇల్లెట్స్ (ఫోర్మెంటెరా) లాంటి ఫేమస్ నగ్న బీచ్‌లు ఉన్నాయి. కానరీ ఐలాండ్స్ లోనూ నగ్నత్వ బీచ్‌లు, రిసార్ట్‌ లు ఉన్నాయి.

⦿ నెదర్లాండ్స్

నెదర్లాండ్స్ లోనూ నగ్న బీచ్‌ లు, పార్కులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో బహిరంగ నగ్నత్వం చట్టబద్ధమైనది. జాండ్‌ వోర్ట్ బీచ్, కాలంట్‌ సూగ్ బీచ్ లాంటి ఫేమస్ నగ్నత్వం బీచ్ లు  ఉన్నాయి.  డచ్ స్పాలు, వెల్‌ నెస్ సెంటర్‌ లలో చాలా మంది నగ్నంగానే కనిపిస్తారు.

కేవలం బీచ్ లలోనే నగ్నత్వానికి అనుమతి  

కొన్ని దేశాల్లో పూర్తి బహిరంగ నగ్నత్వాన్ని అనుమతించవు. కానీ, కొన్ని ప్రత్యేకమైన నగ్న బీచ్‌లు ఉన్నాయి.

⦿ క్రొయేషియా: ఇక్కడ చాలా నగ్నత్వ బీచ్‌లు, రిసార్ట్‌ లు ఉన్నాయి. ముఖ్యంగా హ్వార్, రాబ్ లాంటి దీవుల్లో చాలా మంది నగ్నంగానే కనిపిస్తారు.

⦿ గ్రీస్: ఇక్కడ కూడా బహిరంగ నగ్నత్వం అనుమతించరు. కానీ, రెడ్ బీచ్, సూపర్ ప్యారడైజ్ బీచ్ లలో నగ్నంగా ఉండేందుకు అనుమతిస్తారు.

⦿ బ్రెజిల్: ప్రియా డో పిన్హో,  అబ్రికో బీచ్ లలో పూర్తి స్థాయి నగ్నత్వాన్ని అనుమతిస్తారు.

⦿ అమెరికా:  బహిరంగంగా నగ్నత్వాన్ని అమెరికాలో ఆమోదించనప్పటికీ, టెక్సాస్‌లోని హిప్పీ హాలో, ఫ్లోరిడాలోని హౌలోవర్ బీచ్, కాలిఫోర్నియాలోని బ్లాక్స్ బీచ్‌ లలో చాలా మంది నగ్నంగా కనిపిస్తారు.

నగ్నంగా ఉండేందుకు అనుతించే రిసార్ట్‌ లు, గ్రామాలు

⦿ కాప్ డి’అగ్డే, ఫ్రాన్స్: ఇక్కడ ప్రజలు ఎలాంటి ఆంక్షలు లేకుండా నగ్నంగా జీవింవచ్చు.

⦿ హెడోనిజం II, జమైకా: ఈ అడల్ట్ రిసార్ట్ లో ఎలాంటి దుస్తులు లేకుండా ఉండేందుకు అనుమతిస్తారు.

⦿ బేర్ ఓక్స్ ఫ్యామిలీ నేచురిస్ట్ పార్క్, కెనడా: ఈ పార్క్ లో సందర్శకులు నగ్నంగా తిరగవచ్చు.

⦿ ది నేచురల్ రిసార్ట్, స్పెయిన్: ఈ నేచురల్ హోటల్ లో పర్యాటకులు దుస్తులు లేకుండా ప్రకృతిని ఆస్వాదించవచ్చు.

⦿ సన్‌ఎడెన్ నేచురిస్ట్ రిసార్ట్, దక్షిణాఫ్రికా: ఈ ప్రైవేట్ రిసార్ట్ లోనూ నగ్నంగా బస చేయవచ్చు.

నగ్నత్వం విషయంలో పరిమితులు   

కొన్ని సంస్కృతులు నిర్ధిష్ట రీతిలో నగ్నత్వాన్ని కలిగి ఉంటాయి.

⦿ నార్డిక్ దేశాలు (స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్): ఈ దేశాల్లో పరిమిత ప్రాంతాల్లో నగ్నత్వాన్ని అనుమతిస్తారు.

⦿ జపాన్: పూర్తిగా నగ్నత్వానికి అనుకూలంగా లేనప్పటికీ.. జపనీస్ ఆన్సెన్స్ లో పర్యటకులు నగ్నంగా ఉంటారు.

⦿ఇండియా: మన దేశంలో బహిరంగ నగ్నత్వం అనుమతించబడదు. కానీ, కొన్ని సాంప్రదాయ వర్గాలు (నాగా సాధువులు) మతపరమైన సందర్భాలలో నగ్నత్వాన్ని అనుసరిస్తారు.

Read Also: సమ్మర్ లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి బెస్ట్ డెస్టినేష్స్ ఇవే!

Tags

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×