BIG TV LIVE Originals: డిసెంబర్ 26, 2004న ప్రపంచ చరిత్రంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. శ్రీలంకలో చెలరేగిన సునామీ వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ప్రమాదాన్ని ‘క్వీన్ ఆఫ్ ది సీ డిజాస్టర్’గా పిలుస్తారు. ఈ ఘటనలో ఏకంగా 1,700 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదం మానవ తప్పిదం తోనో, యాంత్రిక వైఫల్యం కారణంగానో జరగలేదు. ప్రకృతి ప్రకోపానికి ప్రాణాలు నీళ్లలో కలిసి పోయాయి. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఊహించని సునామీ విపత్తు
శ్రీలంకలోని అత్యంత అందమైన నైరుతి తీరంలో ‘ది క్వీన్ ఆఫ్ ది సీ’ రైలు ప్రయాణం చేస్తోంది. కొలంబోలో మొదలైన ఈ జర్నీ గాలే వరకు కొనసాగాల్సి ఉంది. అయితే, క్రిస్మస్ పండుగను జరుపుకుని అనేక కుటంబాలు ఈ రైల్లో ప్రయాణం చేస్తున్నారు. స్థానికులతో పాటు సుమారు 1500 మంది ఈ రైల్లోకి ఎక్కారు. 8 బోగీల్లో ప్యాసింజర్లు జర్నీ కొనసాగిస్తున్నారు. టికెట్లు లేకుండా మరికొంత మంది ఎక్కినట్లు దర్యాప్తులో తేలింది. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో పెరాలియా గ్రామం సమీపంలో రైలు కొద్దిసేపు ఆగిపోయింది. అంతకు కొద్ది గంటల ముందే సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో భారీ సునామీ అలలు ఎగసిపడ్డాయి. మొదటి అల తీరాన్ని తాకి, పట్టాలను ముంచెత్తి, రైలుకు స్వల్ప అంతరాయం కలిగించింది. ఇది మాములు అలగా భావించి, రైలు కొద్దిసేపు ఆ తర్వాత తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది.
అలల తాడికిడికి ఎగిరిపోయిన రైలు బోగీలు
ప్రయాణం మొదలైన నిమిషాల వ్యవధిలోనే శక్తివంతమైన అల 10 మీటర్ల ఎత్తుతో వచ్చి రైలును బలంగా ఢీకొట్టింది. సునామీ అల తీవ్రతకు రైలు బోగీలు ప్లాస్టిక్ బొమ్మల్లా ఎగిరిపోయాయి. అన్ని కంపార్ట్ మెంట్లు నీటితో నిడిపోయాయి. ప్రయాణీకులను లోపలే చిక్కుకున్నారు. ఆ తర్వాత వరుస అలలు రావడంతో ప్రయాణీకులు ఎవరూ తప్పించుకోలేకపోయారు. నిమిషాల వ్యవధిలో ఊహించలేని విధ్వంసం సృష్టించింది. రైలు బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. కొన్ని బురదలో చిక్కుకుపోయాయి. మరికొన్ని పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. సునామీ విధ్వంసం ఆ ప్రాంతం అంతటా తీవ్రంగా ఉండటంతో రోడ్లు దెబ్బతిన్నాయి. కమ్యూనికేషన్ లైన్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. స్థానికులు, బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు.
1700 మంది దుర్మరణం
‘క్వీన్ ఆఫ్ ది సీ డిజాస్టర్’కు సంబంధించి ఏకంగా 1700 మందికి పైగా చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరికొంత మంది కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనలు చాలా మంది మృతదేహాలు కూడా దొరకలేదు. ఈ ఘోర విపత్తు నుంచి కొద్ది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విపత్తు చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా మిగిలిపోయింది . 2004లో వచ్చిన సునామీ కారణంగా 14 దేశాలలో 2,30,000 మందికి పైగా మరణించారు. శ్రీలంకలో 35,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: రైలు వస్తుందంటే.. అక్కడ విమానాలు ఆపేస్తారు, విడ్డూరం కాదు అవసరం!