Bunny Vasu: స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా అది ట్రెండ్‌సెట్టరే. ఆయన వేసుకునే దుస్తుల నుంచి మాట్లాడే మాటల వరకు అన్నీ ఒక సంచలనమే. తాజాగా ముంబై నగరంలో అల్లు అర్జున్ దర్శనమిచ్చిన ఒక ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే ఈసారి ఆయన తన ఫ్యాషనబుల్ లుక్‌తో కాకుండా, తన ఒంటిపై ఉన్న ఒక ప్రత్యేకమైన టీ-షర్ట్‌తో చర్చనీయాంశంగా మారారు. ఆ టీ-షర్ట్‌పై సాక్షాత్తూ తెలుగు హాస్యానికి బ్రాండ్ అంబాసడర్‌గా నిలిచిన, నటనా విశ్వరూపుడు బ్రహ్మానందం ‘నెల్లూరు పెద్దారెడ్డి’ గెటప్‌లోని ఫొటోలు ఉండటమే ఈ వివాదానికి అసలు కారణం.
కావాలనే వివాదం రేపుతున్నారు ..
బ్రహ్మానందం అంటే అల్లు అర్జున్‌కు ఎంతో అభిమానం, గౌరవం. ఇది చాలా సందర్భాల్లో ఆయన మాటల్లో, చేతల్లో కనిపించింది. అలాంటిది, ముంబై వీధుల్లో బ్రహ్మానందంపై తనకున్న ప్రేమాభిమానాలను ఒక టీ-షర్ట్ రూపంలో చాటుకుంటే కొందరు నెటిజన్లకు ఎందుకో కంటగింపుగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఈ టీ-షర్ట్‌పై విమర్శలు, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ విమర్శలకు కారణమేమిటో అర్థం కాకపోయినా, కొందరు కావాలనే ఒక మంచి విషయాన్ని కూడా వివాదాస్పదం చేయాలని చూస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ అనవసర రాద్ధాంతంపై అల్లు అర్జున్‌కు అత్యంత ఆప్తుడు, ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనదైన శైలిలో స్పందించారు. ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆగ్రహంతో కూడిన ట్వీట్ చేశారు. “ప్రపంచం గర్వించదగ్గ హాస్యనటుడు బ్రహ్మానందంపై బన్నీ తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా..? ఒక మంచి ఉద్దేశాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్..?” అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. బన్నీ వాసు చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారి, అల్లు అర్జున్ అభిమానులకు ఒక ఊరటనిచ్చింది.
ఒక టీ-షర్ట్ ని…పెద్దది చేసి చూపిస్తున్నారు ..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం ఒక లెజెండ్. మూడు దశాబ్దాలకు పైగా తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు. అల్లు అర్జున్ సైతం బ్రహ్మానందంను ఒక గురువుగా, స్ఫూర్తిగా భావిస్తారు. వారిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. అలాంటి ఒక గొప్ప కళాకారుడిపై ఉన్న అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తే దానిని కూడా తప్పుగా చూడటం ఎంతవరకు సబబు అని బన్నీ వాసు నిలదీయడం సమంజసమే.
కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చౌకబారు ట్రోల్స్‌కు పాల్పడుతున్నారని అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. ఒక స్టార్ హీరో తన అభిమాన నటుడిపై ప్రేమను చూపిస్తే దానిని కూడా విమర్శించడం దిగజారుడు చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ చేసింది కేవలం తన హృదయంలో ఉన్న అభిమానాన్ని ఒక టీ-షర్ట్ రూపంలో చూపించడం మాత్రమే. దానిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.
Kingdom Movie First Single : కింగ్‌డం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది… ‘హృదయం లోపల’ నుంచి వచ్చిన పాట ఇది