India Disneyland park: పిల్లలే కాదు, పెద్దలూ డ్రీమ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టాలనుకునే వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి కోరికలకు ఇప్పుడు సూపర్ ఛాన్స్ లభించబోతోంది. ఎందుకంటే.. భారత్‌లో తొలిసారిగా ఓ డిస్నీల్యాండ్ తరహా థీమ్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఎంత మందికి ఇక్కడ ఉపాధి లభిస్తోంది? ఇవన్నీ తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.
500 ఎకరాల్లో కలల రాజ్యం!
ఈ థీమ్ పార్క్‌ను నిర్మించబోయేది ఏకంగా 500 ఎకరాల విస్తీర్ణంలో. ఇది కేవలం పార్క్ మాత్రమే కాదు.. ఒక వినోద రాజధాని. ఇందులో వందల రకాల రైడ్స్, వినోద కార్యక్రమాలు, మ్యూజికల్ ఫౌంటెన్లు, రోలర్ కోస్టర్లు, ఫాంటసీ క్యాసిల్స్, ఫుడ్ కోర్టులు, 3D థియేటర్లు, ఎంటర్టైన్మెంట్ షోలు, భారతీయ జానపదం కలబోసిన ప్రదర్శనలు ఇలా మరెన్నో ఉంటాయి.
ఎక్కడ ఈ ప్రాజెక్ట్?
ఈ థీమ్ పార్క్ నిర్మించబోయే ప్రదేశం హర్యానా రాష్ట్రంలోని మనసేర్, గురుగ్రామ్ జిల్లాలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. కెఎంపీ ఎక్స్‌ప్రెస్‌వే, హర్యానా ఆర్బిటల్ రైల్ కారిడార్ వంటి కనెక్టివిటీలు ఉండటంతో ఇది టూరిజంకు పర్ఫెక్ట్ స్పాట్.
30,000 మందికి ఉపాధి అవకాశాలు!
ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశ నుంచే సుమారు 30,000 మందికి ఉపాధి కల్పించబోతున్నారు. ఇందులో నేరుగా నిర్మాణ కార్మికులు, ఇంజినీర్లు, మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ సిబ్బంది, సెక్యూరిటీ, మల్టీమీడియా, ఫుడ్ వర్కర్స్ ఇలా అనేక విభాగాల వారు పని చేయనున్నారు. నిర్మాణం పూర్తయ్యాక కూడా 10,000 మందికి పైగా శాశ్వత ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది.
Also Read: Visakhapatnam Railway Station: వైజాగ్ రైల్వే స్టేషన్ రూపం మారుతోంది.. మీకు ఈ విషయం తెలుసా!
హోటల్స్, రియల్ ఎస్టేట్, రోడ్లు.. అన్నీ పక్కాగా!
ఈ పార్క్ కారణంగా పరిసర ప్రాంతాల్లో హోటల్స్, రిసార్ట్స్, షాపింగ్ మాల్స్, రోడ్ల విస్తరణ వంటి అనుబంధ రంగాల్లో మరింత అభివృద్ధి జరుగనుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి, వ్యాపారులకు అవకాశాలు, ప్రభుత్వానికి ఆదాయం లభించనుంది.
ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలుసా?
ఇంకా అధికారిక తేదీని వెల్లడించలేదు కానీ.. పనులు ఇప్పటికే మొదలయ్యాయి. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో ఈ థీమ్ పార్క్ పూర్తిగా అందుబాటులోకి రానుంది. తర్వాత మన దేశపు పిల్లలు విదేశాల్లో ఉండే డిస్నీల్యాండ్ పార్క్‌లను చూసేందుకు ఆశపడాల్సిన అవసరం ఉండదు.
టూరిజం.. కల్చర్.. టెక్నాలజీ
ఈ థీమ్ పార్క్ ఒకటే కాదు.. భారత్‌లో టూరిజం, జాతీయ సంస్కృతి, ఆధునిక సాంకేతికత అన్నిటినీ ఒకే చోట మిళితం చేసే ఒక గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్. సీఎం సైనీ ప్రకారం, ఇది హర్యానా రాష్ట్ర ఆర్థికతను మలుపుతిప్పే ప్లాన్ అని పేర్కొన్నారు.