E-Paper
Advertisement

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!
Advertisement

IRCTC Ticket Booking Problems: దసరా, దీపావళి పండుగలు దగ్గరపడుతుండటంతో రైలు టికెట్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. సొంత ఊళ్లకు వెళ్లేందుకు  పలు ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన సమయంలో IRCTC వెబ్‌ సైట్, యాప్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు బుకింగ్ విండో తెరుచుకున్న వెంటనే పోర్టల్ స్లో కావడం, పేజీలు లోడ్ కాకపోవడం, సర్వర్ స్పందించకపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు. సైట్ తిరిగి సాధారణ స్థితికి వచ్చేలోపే చాలా సీట్లు బుక్ అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం 8 గంటలకే సమస్యలు

రైల్వే అడ్వాన్స్ రిజర్వేషన్‌లో ప్రయాణికులు సాధారణంగా 60 రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే పండుగ సీజన్‌లో డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో బుకింగ్ ప్రారంభమయ్యే సమయంలోనే పోర్టల్‌పై భారీ ట్రాఫిక్ ఏర్పడుతోంది. ఈ సమయంలో వెబ్‌సైట్, యాప్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించే ప్రయాణికులకు సమస్యలు ఎదురవుతున్నాయి. కొందరికి లాగిన్ సమస్యలు, మరికొందరికి పేమెంట్,  సీటు ఎంపిక సమయంలో ఇబ్బందులు వస్తున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి.

ఏజెంట్లపై ప్రయాణికుల ఆరోపణలు!

Advertisement

ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, బుకింగ్ రద్దీ సమయంలో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రైల్వే ఏజెంట్ల ప్రభావం ఇంకా కొనసాగుతోందని కొందరు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయం చాలా తక్కువగా ఉంటుండగా, కొద్దిసేపటికే సీట్లు పూర్తవుతున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే, ఏజెంట్లు అక్రమంగా టికెట్లను పొందుతున్నారన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెయిటింగ్ లిస్ట్‌ తో పెరుగుతున్న ఖర్చులు

కన్ఫర్మ్డ్ రైలు టికెట్లు దొరకకపోవడంతో ప్రయాణికులు బస్సులు, ఇతర రవాణా మార్గాల వైపు చూడాల్సి వస్తోంది. పండుగల సమయంలో వీటికి కూడా డిమాండ్ పెరగడంతో ప్రయాణ ఖర్చులు సాధారణం కంటే ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొంతమంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో కుటుంబంతో కలిసి పండుగ జరుపుకునేందుకు సొంత ఊరికి వెళ్లాలనుకునే వారికి అదనపు ఆర్థిక భారం పడుతోంది.

బుకింగ్ వ్యవస్థపై మళ్లీ ప్రశ్నలు!

Advertisement

పండుగ సీజన్‌లో రైళ్లకు డిమాండ్ ముందుగానే పెరుగుతుందని తెలిసినప్పటికీ, బుకింగ్ ప్రారంభ సమయంలో సర్వర్ సమస్యలు రావడం ప్రయాణికుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఎక్కువ ట్రాఫిక్‌ ను తట్టుకునేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు.

Read Also: రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

Tags

Related News

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

పగిలిన అద్దాలు.. కంపుకొట్టే టాయిలెట్లు.. బాబోయ్.. ఇది వందేభారత్ రైలా?

Big Stories

Advertisement
×