E-Paper
Advertisement

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర.. రోడ్ మధ్యలో డ్రైవర్ గాఢనిద్ర.. ఎంతకీ లేకవకపోవడంతో..

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర.. రోడ్ మధ్యలో డ్రైవర్ గాఢనిద్ర.. ఎంతకీ లేకవకపోవడంతో..
Advertisement

Strange Road Incident: కేరళలోని ఎట్టుమనూర్‌ లో ఓ వింత సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆగస్టు 19న ఎట్టుమనూర్–అతిరంపుళా రహదారిపై రద్దీగా ఉండే సమయంలో ఓ కారు రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది. సాధారణంగా రద్దీ రోడ్డుపై ఏ వాహనం ఆగిపోయినా వెంటనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ఘటనలో కూడా అదే జరిగింది. అయితే కారులో ఉన్న వ్యక్తి పరిస్థితి చూసిన స్థానికులు తొలుత ఆందోళన చెందారు. కారు లోపల డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి కదలకుండా పడిపోయాడు. బయట ఉన్నవాళ్లు అతడికి ఏం జరిగిందో అనుకున్నారు.

హార్ట్ అటాక్ వచ్చిందనకున్న స్థానికులు..

రోడ్డు మధ్యలో కారు నిలిచిపోవడం, డ్రైవర్ స్పందించకపోవడంతో స్థానికులు మొదట భయపడ్డారు. అతడికి అకస్మాత్తుగా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి ఉండవచ్చని భావించారు. గుండెపోటు, మూర్ఛ లేదంటే ఇతర ఆరోగ్య సమస్య కారణంగా డ్రైవర్ స్పృహ తప్పి ఉండవచ్చని అనుకున్నారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కారు రోడ్డుకు మధ్యలో ఉండటంతో వెనుక నుంచి వచ్చిన వాహనాలు ముందుకు వెళ్లలేకపోయాయి. కొద్దిసేపట్లోనే ట్రాఫిక్ పెరిగిపోయింది.

పోలీసులు వచ్చి చూడగానే షాకింగ్ ట్విస్ట్!   

Advertisement

సమాచారం అందుకున్న ఎట్టుమనూర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. చాలా సేపు కష్టపడి కారు డోర్లు ఓపెన్ చేశారు. డ్రైవర్‌ ను పరిశీలించిన తర్వాత, వాహనాన్ని చెక్ చేశారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. కారులో మద్యం సీసాలు, సోడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రైవర్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది. మద్యం మత్తులోనే కారును రోడ్డు మధ్యలోనే ఆపి, డ్రైవర్ లోపల నిద్ర పోయాడని గుర్తించారు.

డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు  

పోలీసులు వెంటనే ఆ కారును రోడ్డు పక్కకు తరలించారు. డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లోనే ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు. ఈ ఘటన చూసిన స్థానికులు మొదట డ్రైవర్‌కు తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చిందేమోనని భయపడ్డారు. కానీ, పోలీసులు చేసిన తనిఖీలో కారులో మద్యం సీసాలు కనిపించడంతో అసలు పరిస్థితి అర్థం అయ్యింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

Advertisement

ఎట్టుమనూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాగిన తర్వాత వాహనాలు నడపడం మంచిది కాదని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎంత నిద్ర వచ్చినా, నడిరోడ్డు మీద పడుకోవడం ఏంటని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటన మరోసారి రహదారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. మద్యం సేవించి వాహనం నడపడం డ్రైవర్‌ కు మాత్రమే కాకుండా రోడ్డుపై ప్రయాణించే ఇతరులకు కూడా ప్రమాదకరం అని తేలిపోయింది. ముఖ్యంగా రద్దీగా ఉండే రహదారులపై ఇలాంటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది.

Read Also: కోల్ వేస్ట్ తో చెక్కు చెదరని రోడ్లు నిర్మాణం.. NIT రూర్కెలా సంచలన ఆవిష్కరణ!

Tags

Related News

ఇండియన్ బుల్లెట్ రైలుపై పట్టాలెక్కేది ఎప్పుడంటే.. జపాన్ అధికారి షాకింగ్ కామెంట్స్!

హైదరాబాద్‌లోనే జపాన్ ఫీలింగ్, మచ్చా తాగుతూ.. అనిమే చూస్తూ.. ఎంజాయ్ చేసేయండి!

స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులకు యాదగిరిగుట్ట దేవస్థానం లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?

అమరావతి ORR డిజైన్‌లో కీలక మార్పులు.. కొత్త రూట్ మ్యాప్ ఇదే!

చంకలో వెంట్రుకలకు రంగులు.. ఆ దేశంలో ఇదే ట్రెండ్!

మధుర మీనాక్షి ఆలయాన్ని కట్టించింది తెలుగు రాజులేనా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 మలుపులు.. ఈ రోడ్డు మీద డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు!

అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ మనసు దోచే 5 ప్రదేశాలు ఇవే

Big Stories

Advertisement
×