E-Paper
Advertisement

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 మలుపులు.. ఈ రోడ్డు మీద డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు!

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 మలుపులు.. ఈ రోడ్డు మీద డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు!
Advertisement

Kolli Hills Road: పర్వత ప్రాంతాల్లో డ్రైవింగ్ అంటేనే ఓ ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఒకవైపు ఎత్తైన కొండలు.. మరోవైపు లోతైన లోయలు.. మధ్యలో మెలికలు తిరిగే రోడ్డు. ఇలాంటి మార్గాల్లో ప్రయాణం ఎంతో సాహసోపేతంగా ఉంటుంది. అయితే, తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో ఉన్న కొల్లి హిల్స్ రోడ్ మాత్రం వీటన్నింటికంటే ప్రత్యేకం. వరుసగా వచ్చే 70 మలుపులు ఈ రోడ్డును దేశంలోని టాప్ అడ్వెంచర్ డ్రైవింగ్ రూట్లలో ఒకటిగా మార్చాయి.

కొండపైకి చేరాలంటే 70 మలుపులు!

తమిళనాడులోని తూర్పు కనుమల్లో ఉన్న కొల్లి హిల్స్‌ ను స్థానికంగా కొల్లిమలై అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి సుమారు 1,300 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకునే ఘాట్ రోడ్డులో వరుసగా 70 మలుపులు ఉంటాయి. ఈ మలుపులకు ఒక్కో నంబర్ కేటాయించడం మరో ప్రత్యేకత. కింది ప్రాంతం నుంచి పైకి వెళ్తున్న కొద్దీ మలుపులు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటాయి. దీంతో కొల్లి హిల్స్ ప్రయాణం సాధారణ కొండ ప్రయాణం కంటే భిన్నమైన అనుభూతిని ఇస్తుంది.

డ్రైవర్లకు అసలైన పరీక్ష!

Advertisement

కొల్లిహిల్స్ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు స్పీడ్ కంటే కంట్రోల్ ముఖ్యం. కొన్ని మలుపులు చాలా ఇరుకుగా, షార్ప్ గా  ఉంటాయి. ఎదురుగా వెహికల్ వస్తే మరింత జాగ్రత్తగా మలుపు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బైక్‌లపై వెళ్లే వారికి ఈ మార్గం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వరుస మలుపుల కారణంగా గేర్, వేగం, బ్రేకింగ్‌పై ఎప్పుడూ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అందుకే కొల్లి హిల్స్‌ ను మోటార్‌ బైకింగ్ అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

మలుపుల మధ్య ప్రకృతి అందాలు!

ఈ రోడ్డులో సాహసం మాత్రమే కాదు.. ప్రకృతి అందాలు కూడా ఆకట్టుకుంటాయి. దట్టమైన పచ్చదనం, కొండలపై నుంచి కనిపించే మైదాన ప్రాంతాలు, మబ్బులతో కప్పబడే శిఖరాలు ప్రయాణాన్ని మరింత అందంగా మారుస్తాయి. పైకి వెళ్లే కొద్దీ వాతావరణంలో కూడా మార్పు కనిపిస్తుంది. సముద్ర మట్టానికి 1,300 మీటర్ల వరకు ఎత్తు ఉండటంతో కొల్లి హిల్స్‌ లో వాతావరణం సాధారణంగా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

అగయ గంగై జలపాతం మరో ప్రత్యేకత!

Advertisement

కొల్లి హిల్స్‌ కు వెళ్లినప్పుడు 70 మలుపుల ప్రయాణంతో పాటు అగయ గంగై జలపాతంను చూసేందుకు చాలామంది పర్యాటకుల ఆసక్తి చూపిస్తారు. ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. దీంతో పాటు అరపలీశ్వరర్ ఆలయం, సీకుపారై వ్యూ పాయింట్, మాసిలా జలపాతం, ఎట్టుకై అమ్మన్ ఆలయం లాంటి ప్రాంతాలు కూడా కొల్లి హిల్స్‌ లో చూడదగిన ప్రదేశాలుగా తమిళనాడు టూరిజం వెల్లడించింది.

సాహసం.. ప్రకృతి.. రెండూ ఒకే చోట!

ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రసిద్ధ హిల్ స్టేషన్లతో పోలిస్తే కొల్లి హిల్స్‌ కు ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఇక్కడి ప్రయాణంలో గమ్యం కంటే దారే అదిరిపోయే ఎక్స్ పీరియెన్స్ గా మారుతుంది. ఒకవైపు 70 మలుపులు.. మరోవైపు తూర్పు కనుమల పచ్చదనం.. మధ్యలో అడ్వెంచరస్ డ్రైవ్.. ఇదే కొల్లి హిల్స్ ప్రత్యేకత.

Read Also: ప్రపంచంలోని టాప్ లగ్జరీ ట్రైన్స్.. ఒక్కో జర్నీ ఖర్చు తెలిస్తే షాక్!

Tags

Related News

మధుర మీనాక్షి ఆలయాన్ని కట్టించింది తెలుగు రాజులేనా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ మనసు దోచే 5 ప్రదేశాలు ఇవే

ఎమర్జెన్సీ కోడ్ యాక్టివేట్‌తో ప్రయాణికులు బెంబేలు, ఈసారి బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ వంతు, ఏం జరిగింది?

31 అడుగుల ఒంటి స్తంభం.. 700 ఏళ్ల చరిత్రకు సాక్ష్యం.. నల్లగొండలో ఈ చారిత్రక కట్టడం ఎక్కడుందో తెలుసా?

హోం వర్క్ లేదు.. ఎగ్జామ్స్ ఉండవు.. అయినా ఎడ్యుకేషన్ లో ప్రపంచంలోనే నెంబర్ వన్ కంట్రీ!

గోవా కంటే బెటర్.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఈ 4 ప్రదేశాలు బెస్ట్

వర్కింగ్ వీసాలపై అమెరికా మరో బిగ్ వార్నింగ్.. H-1B వీసాలను రద్దు..?

Big Stories

Advertisement
×